Heart Attack: పదేళ్ల బాలుడికి గుండె పోటు.. తల్లి ఒడిలోనే కన్నుమూత
ABN , Publish Date - Sep 06 , 2025 | 05:04 AM
ఆటలాడుకునే పదేళ్ల బాలుడికి గుండెపోటు రావడం, అనంతరం తల్లి ఒడిలో ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది.
కొల్హాపూర్: ఆటలాడుకునే పదేళ్ల బాలుడికి గుండెపోటు రావడం, అనంతరం తల్లి ఒడిలో ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కోడోలి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శ్రావణ్ గావడే అనే బాలుడు ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద స్నేహితులతో కలిసి ఆడుకున్నాడు. ఒంట్లో ఏదో ఇబ్బంది అనిపించడంతో ఇంటికి వెళ్లిపోయాడు. తల్లి ఒడిలో పడుకొని సేద తీరాడు. కొద్దిసేపటికే గుండె పోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.