Share News

Tomato Price: నిలకడగా టమోటా ధరలు.. కిలో ఎంతంటే,,

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:14 PM

మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఏడాది పొడవునా టమోటా పంట సాగుచేస్తుంటారు. ఏ సమయంలో చూసినా మండలంలో రెండువేల ఎకరాలకుపైగా టమోటా సాగులో ఉంటుంది. ఈ యేడాది ప్రారంభంలో ధరలు లేక రైతులు నష్టాలు చవిచూశారు.

Tomato Price: నిలకడగా టమోటా ధరలు.. కిలో ఎంతంటే,,

- వైరస్‌తో రైతుల్లో ఆందోళన

- ఎకరాకు రూ.20వేలకుపైగా అదనపు ఖర్చు

తనకల్లు(కడప): మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఏడాది పొడవునా టమోటా(Tomato) పంట సాగుచేస్తుంటారు. ఏ సమయంలో చూసినా మండలంలో రెండువేల ఎకరాలకుపైగా టమోటా సాగులో ఉంటుంది. ఈ యేడాది ప్రారంభంలో ధరలు లేక రైతులు నష్టాలు చవిచూశారు. రెండు నెలలుగా టమోటా ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. అన్నమయ్య జిల్లా మొలకలచెరువు, మదనపల్లి మార్కెట్‌లో 30 కిలోల బాక్స్‌ రూ. 700 నుంచి ప్రారంభమై రూ.1100 దాకా ధరలు ఉన్నాయి.


కర్ణాటక(Karnataka)లోని కోలారు, చింతామణి, వడ్డిపల్లి మార్కెట్‌లో 15కిలోల బాక్స్‌ రూ.300నుంచి రూ.700 దాకా ధరలు పలుకుతున్నాయి. టమోటా దిగుబడి వస్తున్న రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. ధరలు రావడంతో మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రైతులు టమోటా సాగుచేశారు. 20 రోజులుగా వాతావరణంలోని మార్పుల కారణంగా వర్షాలు పడుతూనే ఉండడం, చల్లదనం పెరగడంతో టమోటా పంటకు వైరస్‌ వ్యాపించింది. వైర్‌సతోపాటు ఆకుముడుత, కాయలకు మచ్చలు రావడం మొదలయ్యాయి. దీంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ధరలు నిలకడగా ఉన్నాయి,


ఎంతో కొంత డబ్బులు చేతికొస్తాయని ఆనందపడుతున్న సమయంలో ఎడతేరపిలేని వర్షాలు, వాతావరణంలో మార్పుల వల్ల టమోటా రైతులు ఆందోళన చెందుతున్నారు. వైరస్‌, ఆకుముడత, మచ్చలను నియంత్రించడానికి రైతులు రోజుమార్చి రోజు పురుగు మందులను పిచికారీ చేస్తున్నారు. ఎకరం పంటకు అదనంగా రూ.20వేల నుంచి రూ.30వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. రోజుమార్చి రోజు వరసగా ఏడు నుంచి పదిసార్లు పిచికారి చేసి వైర్‌సను నియంత్రిస్తున్నట్లు రైతులు అంటున్నారు. వైరస్‌ నియంత్రణతో టమోటా పంట దిగుబడి వచ్చి, ఇలాగే ధరలు కొనసాగితే ఎకరానికి రూ.1.50 లక్షల నుంచి రెండు లక్షల వరకు మిగలనున్నట్లు రైతులు చెబుతున్నారు.


kadapa1.2.jpg

రోజుమార్చి రోజు పిచికారీ చేయాల్సిందే

ఎడతెరపి లేని వర్షాలు, వాతావరణంలో మార్పులు, చల్లదనం పెరగడంతో టమోటా పంటకు వైరస్‌, ఆకుముడత, కాయల మచ్చలు ఏర్పడుతున్నాయి. వీటి ని యంత్రణకోసం రోజుమార్చి రోజు మందులు పిచికారి చేయా ల్సి వస్తోంది. దీంతో అదనంగా ఎకరానికి మరో రూ.30వేలు ఖర్చు అవుతోంది. ధరలు నిలకడగా ఉండడంతో, అదనపు ఖర్చు పెడుతున్నాం.

- సురే్‌ష రెడ్డి, రైతు, కొత్తకురవపల్లి


సబ్సిడీతో మందులు సరఫరా చేయాలి

ప్రస్తుతం మార్కెట్‌లో టమోటా ధరలు నిలకడగా ఉన్నాయి. కాయలు దిగుబడి వస్తున్నాయి. ఆనందంగా ఉంది. వాతావరణంలో మార్పులు, వర్షం కారణంగా వైరస్‌, ఆకుముడుత, కాయలకు మచ్చలు వ్యాపించాయి. నియంత్రణ కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. రైతు సేవా కేంద్రాల ద్వారా సబ్సిడీ ధరలతో పురుగు మందులు, బయో ఫెర్టిలైజర్స్‌ ఇప్పించాలి.

- బయ్యారెడ్డి, రైతు, నడిమికుంటపల్లి


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 26 , 2025 | 01:14 PM