AP News: టమోటాను మేమే కొనుగోలు చేస్తాం..
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:31 AM
మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమోటా కొనుగోలు చేస్తామని ఆ శాఖ ఏడీ రాఘవేంద్ర కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు టమోటా కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని సూచించారని తెలిపారు.
- జిల్లా మార్కెటింగ్ శాఖ ఏడీ రాఘవేంద్ర కుమార్
అనంతపురం: మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమోటా(Tomato) కొనుగోలు చేస్తామని ఆ శాఖ ఏడీ రాఘవేంద్ర కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు టమోటా కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని సూచించారని తెలిపారు. ఈ మేరకు బుధవారం రాప్తాడు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో టమోటా కొనుగోలు చేపట్టామని తెలిపారు. కిలో రూ.20తో కొనుగోలు చేశామని పేర్కొన్నారు.

వాటిని వైజాగ్(Vizag)లోని రైతుబజారుకు తరలించామని అన్నారు. ప్రస్తుతం అక్కడ ధరలు ఎక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచి కొనుగోలు తరిస్తున్నామని తెలిపారు. దీని వలన ఇక్కడి రైతులకు లాభం చేకూరడంతోపాటు..ఎగుమతి ప్రాంతాల్లోని ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News