పొగమంచు ఎఫెక్ట్.. కొండెక్కిన టమాటో ధరలు.!

ABN, Publish Date - Dec 20 , 2025 | 08:37 PM

తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా టమాట రైతులపై తీవ్రంగా నష్టపోతున్నారు. పొగమంచు కారణంగా దిగుబడి తక్కువగా రావడంతో టమాట ధరలు అమాంతం ఆకాశాన్ని అంటాయి.

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు బాగా కురుస్తోంది. దీని ప్రభావం టమాట రైతులపై తీవ్రంగా నష్టపోతున్నారు. పొగమంచు కారణంగా దిగుబడి తక్కువగా రావడంతో టమాట ధరలు అమాంతం ఆకాశాన్ని అంటాయి. కేజీ టమాటలు రూ.45 గా ఉంది. ఇది కూడా రైతు బజారులో ఉంది. అదే రిటైల్ మార్కెట్లో అయితే కేజీ టమాట ధర రూ. 50 నుంచి రూ. 60 మధ్య పలుకుతుంది. ఈ స్థాయిలో టమాటల ధరలు పెరగడంతో సామాన్యులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పడింది. ఒకప్పుడు రూ.500 పెడితే నెల అంత సరిపోయే సరుకులు వచ్చేవి. కానీ నేడు వారం రోజులకు సరిపడ సరుకులు రావడం లేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలపై ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. టమాట ధరలు అమాంతం పెరగడానికి కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు పై వీడియోను వీక్షించండి.


ఇవి కూడా చదవండి:

President and Vice President Visit: హైదరాబాద్‌లో కొనసాగుతున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటనలు...

CP Sajjanar: అనుమానాస్పద కాల్స్ వస్తే 1930కి కాల్ చేయండి : సీపీ సజ్జనార్

Updated at - Dec 20 , 2025 | 08:49 PM