CP Sajjanar: అనుమానాస్పద కాల్స్ వస్తే 1930కి కాల్ చేయండి : సీపీ సజ్జనార్
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:54 PM
సైబర్ నేరాల గురించి హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక విషయాలను వెల్లడించారు. ఏపీకే ఫైల్స్, ఓటీపీ, బ్యాంక్ ట్రాన్సిషన్ పై అప్రమత్తంగా ఉండాలని , అనుమానాస్పద కాల్స్ వస్తే 1930 లేదా 100 కి కాల్ చేయమని ప్రజలకు తెలియజేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 20: ఏపీకే ఫైల్స్, ఓటీపీ, బ్యాంక్ ట్రాన్సిషన్ పై అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్(Hyderabad CP Sajjanar) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'బయట రాష్ట్రాల్లో ఉండి నిందితులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వేరొక స్టేట్స్ లో ఉన్న నిందితుల్ని గుర్తించడం, డబ్బును రికవరీ చేయడం కష్టంగా మారింది. ఈ సైబర్ మోసాల కారణంగా హైదరాబాద్ ప్రజలు రోజుకు కోటి రూపాయలు నష్టపోతున్నారు. అలానే సైబర్ నేరగాళ్లు రెండు విధాలుగా నేరాలకు పాల్పడుతున్నారు. ఒకటి పెట్టుబడి పేరుతో మోసం చేస్తున్నారు.... రెండోవది డిజిటల్ అరెస్ట్ తో మోసం చేస్తున్నారు.
డిజిటల్ అరెస్ట్ తో ఎక్కువగా వృద్ధులు, రిటైడ్ ఉద్యోగులు మోసపోతున్నారు. ప్రజలు సైబర్ కేటుగాళ్లు, వాళ్ల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా అనుమానాస్పద కాల్స్ వస్తే 1930 కి లేదా 100 కి కాల్( cyber crime alert) చేయండి. రాబోయే పండుగలు సంక్రాంతి, క్రిస్మస్ సందర్భంగా సైబర్ నేరగాళ్లు ఆఫర్ల పేరుతో మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. ఇక మధుర నగర్‌లో ట్రాఫిక్ సమస్యల నివారణకు త్వరలో చర్యలు కూడా తీసుకుంటాం. మధుర నగర్ పోలీస్ స్టేషన్ ను త్వరలోనే ప్రజలకి అనువుగా అందుబాటులో ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేస్తాం' అని సజ్జనార్ వెల్లడించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు(phone tapping case)పై కూడా సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో సిట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని, త్వరలో అన్ని వివరాలు తెలియజేస్తామని సజ్జనార్ వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని వివరాలు సేకరిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి సిట్ కార్యాలయం విషయంలో ఆలోచన చేస్తున్నామని, ప్రస్తుతం జూబ్లీహిల్స్ పీఎస్ లోనే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ సాగుతుందని తెలిపారు. మరోవైపు ఐ బొమ్మ రవి కేసు గురించి అడిషనల్ సీపీ శ్రీనివాస్ పలు విషయాలను వెల్లడించారు. 'ఐ బొమ్మ రవి విచారణ జరుగుతుంది. సమాధానాలు చేప్పడంలేదని బయట ఊహాగానాలు వస్తున్నాయి. మా స్టైల్ లో మేము విచారణ చేస్తున్నాము. అతని నుండి సమాధానాలు రాబడుతున్నాం' అని ఆయన వెల్లడించారు.
ఇవీ చదవండి:
కాలికి కాలు, చెయ్యికి చెయ్యికి అనేలా ట్రీట్ చేస్తే... వారంతా కకావికలమే: పవన్
బెంగాల్‌లో ప్రతికూల వాతావరణం.. మోదీ పర్యటనకు ఆటంకం.!