Share News

PM Modi in WB: బెంగాల్‌లో ప్రతికూల వాతావరణం.. మోదీ పర్యటనకు ఆటంకం.!

ABN , Publish Date - Dec 20 , 2025 | 03:37 PM

బెంగాల్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో వర్చువల్‌గా ఆ కార్యక్రమానికి హాజరై పలు అభివృద్ధి పనులను ప్రారంభించారాయన.

PM Modi in WB: బెంగాల్‌లో ప్రతికూల వాతావరణం.. మోదీ పర్యటనకు ఆటంకం.!
PM Modi

ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమ్ బెంగాల్‌(West Bengal)లోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌(Helicopter)ను దారి మళ్లించారు అధికారులు. షెడ్యూల్ ప్రకారం, మోదీ శనివారం ఉదయం 10:30 గంటలకు నేతాజీ సుభాశ్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి, 11:15 గంటలకు హెలికాప్టర్ ద్వారా తాహెర్‌పుర్(Taherpur )కు చేరుకోవాల్సి ఉండగా.. పొగ మంచు, అననుకూల వాతావరణం ఆటంకం కలిగించాయి. ఫలితంగా ఆయన అదే హెలికాఫ్టర్‌లో కోల్‌కతాకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకూ మోదీ అక్కడే వేచి చూశారని అధికారులు తెలిపారు. దీంతో ఆయన పర్యటన ఆలస్యమైనట్టు పేర్కొన్నారు.


నాదియా(Nadia) జిల్లాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొని.. రూ.3,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంది. దీంతో పాటు ఎన్‌హెచ్-34లోని బరజగులి-కృష్ణానగర్ సెక్షన్‌లో 66.7 కి.మీ నాలుగు లేన్ల విస్తరణ, ఉత్తర 24 పరగణాల జిల్లాలో అదే రహదారిలోని 17.6 కి.మీ. బరసత్-బరజగులి సెక్షన్‌లో నాలుగు లేన్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌లు కోల్‌కతా, సిలిగురి(Kolkata and Siliguri) మధ్య కీలక అనుసంధాన లింకులుగా పనిచేయనున్నాయి. అయితే.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆయన అక్కడకు వెళ్లలేకపోయారు. ప్రత్నామ్నాయంగా రోడ్డు మార్గాన వెళ్లాలనుకున్నా.. ఇతర షెడ్యూళ్లకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. దీంతో.. విమానాశ్రయంలోనోని వీఐపీ లాంచ్ నుంచే వర్చువల్‌(Virtual)గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ. ఈ పర్యటన ముగిశాక రెండు రోజుల పాటు అస్సామ్‌(Assam)కు వెళ్లనున్నారు.


ఇవీ చదవండి:

కెనడా జనాభాలో తగ్గుదల.. 1946 తరువాత తొలిసారిగా..

మరిన్ని ఉక్రెయిన్ భూభాగాలను లాగేసుకుంటాం: పుతిన్ వార్నింగ్

Updated Date - Dec 20 , 2025 | 03:41 PM