Mallareddy Kabaddi: మల్లారెడ్డా మజాకా.. కబడ్డి.. కబడ్డి అంటూ..
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:48 PM
మల్లారెడ్డి అంటే మల్లారెడ్డే.. ఆయనకు ఎవరూ పోటీలేరు.. సాటి రారంతే.. అవునుమరి.. ఏం చేసినా.. ఏం చేయాలన్నా ఆయన వల్లే అవుతుందనిపించేలా మల్లారెడ్డి పనులు ఉంటాయి. కష్టపడ్డ.. పాలు అమ్మిన.. పూలు అమ్మిన.. కాలేజీలు కట్టిన అంటూ..
మేడ్చల్, డిసెంబర్ 20: మల్లారెడ్డి అంటే మల్లారెడ్డే.. ఆయనకు ఎవరూ పోటీలేరు.. సాటి రారంతే.. అవునుమరి.. ఏం చేసినా.. ఏం చేయాలన్నా ఆయన వల్లే అవుతుందనిపించేలా మల్లారెడ్డి పనులు ఉంటాయి. కష్టపడ్డ.. పాలు అమ్మిన.. పూలు అమ్మిన.. కాలేజీలు కట్టిన అంటూ మల్లారెడ్డి చెప్పిన డైలాగ్ ఏ రేంజ్‌లో వైరల్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఏడు పదుల వయసులోనూ ఆయన చాలా యాక్టీవ్‌గా ఉంటూ.. అందరినీ ఆశ్చర్యానికి గురు చేస్తుంటారు. డ్యాన్స్ వేస్తారు.. పాట పడుతారు.. ఆటలాడుతూ.. ప్రత్యర్థులపై తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చుతారు.. ఒకటేమిటి మల్లారెడ్డి ఏం చేసినా వైరల్ అవ్వాల్సిందే అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. మరి ఆ వీడియోలో మల్లారెడ్డి ఏం చేశారో ఓసారి తెలుసుకుందాం..
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రాజకీయంగానే కాదు.. సామాజికంగా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ తనదైన శైలిలో సందడి చేస్తుంటారు. తాజాగా మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి పురపాలక పరిధి జగన్ గూడ గ్రామంలో ఆటల పోటీలు నిర్వహించారు. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ సొసైటీ (TGMREIS) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడల మీట్ 2025-26 కార్యక్రమాన్ని ఏమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం ఆటల్లో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి కబడ్డీ, ఫుట్‌బాల్ ఆడారు. కబడ్డి.. కబడ్డి అంటూ కూతకు వెళ్లిన మల్లారెడ్డి.. విద్యార్థులు పట్టుకుని ఔట్ చేశారు. మల్లారెడ్డి తన ఆటతో విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే.. ‘సీఎంలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. విద్యార్థులకు ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసి వసతులు కల్పించిన ఘనత కేసీఆర్‌దే’ అని అన్నారు.
Also Read:
CM Revanth Reddy: నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..
Sonia Gandhi: ఉపాధి హామీ పథకంపై బుల్డోజర్.. సోనియాగాంధీ ఫైర్