Share News

CM Revanth Reddy: నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..

ABN , Publish Date - Dec 20 , 2025 | 05:33 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. దీంతో మూడు పాత కేసులకు సంబంధించి విచారణ పూర్తయింది. సీఎం హాజరుతో కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

CM Revanth Reddy: నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..
CM Revanth Reddy Appears Before Court

హైదరాబాద్, డిసెంబర్ 20: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నాంపల్లి ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ (OU), తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్లలో గతంలో నమోదైన కేసుల విచారణకు ఆయన హాజరు కావడం విశేషం.

ఈ మూడు కేసులు ప్రధానంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు లేదా రాజకీయ కార్యక్రమాల సందర్భంలో నమోదయినవి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఈ కేసులు నమోదయ్యాయి.


కోర్టులో జడ్జి ముందు రేవంత్ రెడ్డి ఎగ్జామినేషన్ (ప్రశ్నోత్తరాలు) ప్రక్రియ పూర్తి చేశారు. మూడు కేసుల్లోనూ ఈ దశ పూర్తయిన నేపథ్యంలో తదుపరి విచారణ లేదా తీర్పు కోసం కోర్టు తేదీ నిర్ణయించనుంది. సీఎం హాజరుతో కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

మీడియా, సామాన్యులను కోర్టు హాల్ సమీపంలోకి అనుమతించలేదు. కాంగ్రెస్ నేతలు ఈ కేసులను రాజకీయ కుట్రతో మోపినవని విమర్శిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ఉదయం పూట ఇలా చేస్తారా.. చిన్నతనంలోనే వార్ధక్య లక్షణాలు వస్తాయి జాగ్రత్త!

నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్

Read Latest and Health News

Updated Date - Dec 20 , 2025 | 05:33 PM