Home » Mallareddy
ప్రీతిరెడ్డి పుట్టినరోజు ఫ్లెక్సీల్లో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు లేకపోవడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఫ్లెక్సీల చించివేతపై స్పందించిన ప్రీతిరెడ్డి, తన పుట్టినరోజు వేడుక రాజకీయ కార్యక్రమం కాదని తెలిపారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయ వివాదానికి దారితీశాయి. ఫ్లెక్సీని కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ చించివేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తి కావడంతో, ఆ పార్టీ పాలనా వైఫల్యాలు, ఇచ్చిన హామీల అమలులో మోసాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసనలకు దిగింది.
ప్రముఖ నటుడు రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగింది. ఈ ఈవెంట్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు. ఇందుకోసం అనుకూలమైన స్థానాన్ని ఎంచుకునే పనిలో ఉన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్త రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెడ్ పెన్‌తో రాసిన లేఖపై రక్తపు మరకలు కూడా ఉన్నాయి. మల్లారెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్ కార్యక్రమాల్లో కనిపిస్తుండటంతో కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని లేఖలో పేర్కొన్నారు.
తాను పార్టీ మారుతున్నారనే ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఆలోచన లేదని, పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి అరెస్టయ్యారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
సామూహిక వందేమాతర గీతాలాపన కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆహ్వానించినట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి చెప్పారు. బీజేపీలో చేరతానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డిని సీఎం చేసింది తానేనని, సినిమాల్లో సీఎం పాత్ర చేయాలని ఉందని మల్లారెడ్డి పేర్కొన్నారు.