Mallareddy: ఏపీలో చంద్రబాబు విజన్ అద్భుతం..మల్లారెడ్డి ప్రశంసలు

ABN, Publish Date - Sep 09 , 2025 | 01:49 PM

సీఎం చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను బాగా అభివృద్ధి చేస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి తిరుమల సందర్శనలో పేర్కొన్నారు. గతంలో పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో లేదని, రివర్స్ అయ్యిందన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆంధ్రప్రదేశ్‌ను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) తిరుమల సందర్శనలో అన్నారు. ఒకప్పుడు ఆంధ్రా వాసులు వారి భూములు అమ్ముకుని హైదరాబాద్‌లో ఆస్తులు కొనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైందన్నారు. ఇప్పుడు తెలంగాణ వాసులు ఏపీలో ఆస్తులు కొంటున్నారని, తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగోలేదని మల్లారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ వేగంగా పురోగమిస్తోందని, ఆస్తుల విలువలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

Updated at - Sep 09 , 2025 | 01:49 PM