Home » Chandra Babu
కరువు ప్రాంతమైన రాయలసీమకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్ల అంచనాతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో హార్టికల్చర్ హబ్ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తిరుమల ప్రవేశ ద్వారమైన అలిపిరి వద్ద సీఎం చంద్రబాబుపై పీపుల్స్‌వార్ తీవ్రవాదులు క్లైమోర్ మైన్స్‌తో దాడికి పాల్పడిగురువారం నాటికి సరిగ్గా 23 ఏళ్ళయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన జవాన్ హవిల్దార్ కువ్వారపు కిషన్ మృతి చెందారు. ఆయన మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
కుప్పంలో సీఎం చంద్రబాబు సోమ, మంగళవారాల్లో పర్యటించనున్నారు. మొదటగా ఖరారైన పర్యటన షెడ్యూల్‌లో సోమవారం జలహారతి కార్యక్రమం ఉండగా.. తాజాగా మంగళవారానికి మార్చారు. మిగిలిన షెడ్యూల్ యథాతథంగా ఉన్నప్పటికీ కొన్ని కార్యక్రమాలు అటూ ఇటూ మారాయి.
ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానంపై కాశీలో సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో ప్రజాభాగస్వామ్యం, సేవాభావం, సామాజిక బాధ్యత కీలకమనే సందేశాన్ని సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
రాష్ట్రంలో 14 పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.5,912 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులకు అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద ఫేజ్-3 ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్ర వైద్యరంగంలో సంజీవని పథకం గేమ్‌చేంజర్‌గా మారనుందని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చే జనవరి 1 నుంచి ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.249 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 10 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి శనివారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఫైళ్ల క్లియరెన్స్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్న వారిపై మండిపడ్డారు.
‘జిల్లాలో చాలా మంది ఔత్సాహికులు డీకేటీ భూముల్లోనూ చిన్నస్థాయి పరిశ్రమల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాంటి వారికి కూడా పారిశ్రామిక రుణాల్ని మంజూరు చేస్తే, ప్రోత్సహించినట్లు అవుతుంది’ అని కలెక్టర్ సుమిత్‌కుమార్ సీఎం చంద్రబాబును కోరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో పర్యటించనున్నారు. గ్రౌండ్ రెంట్ భూములకు 22ఏ నుంచి విముక్తి కల్పించిన నేపథ్యంలో లబ్ధిదారులతో సమావేశమవుతారు.