Share News

సత్యమే గెలిచింది.. నిజాయతీ నిలిచింది: మంత్రి అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Feb 01 , 2026 | 05:01 PM

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. దీనిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు స్పందించారు.

సత్యమే గెలిచింది.. నిజాయతీ నిలిచింది: మంత్రి అచ్చెన్నాయుడు
ED Gives Clean Chit to CM Chandrababu

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో సీఎం చంద్రబాబు నాయుడుకు(CM Chandrabau Naidu) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో సీఎం చంద్రబాబుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్‌చిట్ ఇవ్వడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ఆయన నిష్కళంకమైన రాజకీయ ప్రస్థానానికి దక్కిన గొప్ప విజయమిదని ఆయన అన్నారు.


ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘సత్యం, న్యాయం మీద నిలబడే నాయకుడు చంద్రబాబు అని ఈ తీర్పుతో మరోసారి రుజువైంది. స్కిల్ కేసులో ఆయనకు ఎలాంటి సంబంధంలేదని ఈడీ స్పష్టం చేయడం మా అందరికీ గర్వకారణం. గత ప్రభుత్వం ఎన్ని కక్షపూరిత కుట్రలు చేసినా.. చట్టానికి గౌరవమిచ్చి ధైర్యంగా నిలిచిన నాయకత్వం ఆయనది. విజయవాడ ఏసీబీ కోర్టులో కేసు విత్‌డ్రా కావడం తప్పుడు ఆరోపణలు చేసిన వారికి చెంపపెట్టు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువతకు ఉపాధి కల్పించాలని ఆయన తెచ్చిన స్కిల్ డెవలప్‌మెంట్ ఆలోచనను జగన్ అండ్ కో రాజకీయం చేశారు. అటు ఏపీ సీఐడీ, ఇటు ఈడీ రెండూ ఆయన పాత్రలేదని తేల్చడం చంద్రబాబు పరిపాలనా దక్షతకు నిదర్శనం. ​ఎన్ని కుట్రలు చేసినా, వ్యక్తిగత దూషణలకు దిగినా చివరికి గెలిచేది సత్యమే అని సీఎం చంద్రబాబు నిరూపించారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఆయన నాయకత్వంలో మేమంతా ముందడుగు వేస్తాం’ అని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచి నందినగర్‌కు కేసీఆర్.. పోలీసుల అలర్ట్

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న సిట్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 01 , 2026 | 05:51 PM