Share News

దేశంలో వాస్తవ సంక్షోభాలను పట్టించుకోని బడ్జెట్: రాహుల్ గాంధీ

ABN , Publish Date - Feb 01 , 2026 | 02:39 PM

బడ్జెట్‌పై పార్లమెంట్ వేదికగా స్పందిస్తానని రాహుల్ గాంధీ అన్నారు. అయితే, ఈ బడ్జెట్ నిస్సారంగా ఉందని కాంగ్రెస్ విమర్శించింది.

దేశంలో వాస్తవ సంక్షోభాలను పట్టించుకోని బడ్జెట్: రాహుల్ గాంధీ
Rahul Gandhi on Budget

ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై (Budget 2026-27) లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. ఇది దేశంలోని వాస్తవ సంక్షోభాలను పట్టించుకోని బడ్జెట్ అని ఎక్స్‌ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు.

‘యువతకు ఉద్యోగాలు లేవు, కుంగుతున్న తయారీ రంగం, పెట్టుబడులను వెనక్కు తీసుకుంటున్న ఇన్వెస్టర్లు, సంక్షోభంలో రైతాంగం, అంతర్జాతీయ సంక్షోభాలతో ఎదురవుతున్న ముప్పు.. వీటన్నిటినీ బడ్జెట్‌లో పట్టించుకోలేదు. ఇది తప్పులు సరిదిద్దుకోలేని బడ్జెట్, దేశంలోని వాస్తవ సంక్షోభాలను పట్టించుకోని బడ్జెట్’ అని ఎక్స్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు.

అయితే, కాంగ్రెస్‌ పార్టీ (Congress) మాత్రం బడ్జెట్‌పై విమర్శలు ఎక్కుపెట్టింది. బడ్జెట్ నిస్సారంగా ఉందని కామెంట్ చేసింది. ‘బడ్జెట్ మొత్తాన్ని ఇంకా చదవాల్సి ఉన్నప్పటికీ 90 నిమిషాల బడ్జెట్ ప్రసంగాన్ని గమనిస్తే ఇది అంచనాలను అసలేమాత్రం అందుకోలేదనే చెప్పాలి. పూర్తి నిస్సారంగా ఉంది. బడ్జెట్‌లో పారదర్శకత లోపించింది. ముఖ్య పథకాలు, కార్యక్రమాలకు నిధుల కేటాయింపుపై స్పష్టత లేదు’ అని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ (Jairam Ramesh) విమర్శించారు.


అంతకుముందు, మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రసంగిస్తూ బడ్జెట్‌ను సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌గా (Reform Express) అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దూసుకుపోతోందని అన్నారు. ప్రభుత్వం తన బాధ్యతలన్నిటినీ నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ దేశం ఆర్థిక క్రమశిక్షణతో సుస్థిరాభివృద్ధి బాటలో సాగుతోందని అన్నారు.


ఇవీ చదవండి:

భారతదేశ బడ్జెట్ చరిత్ర.. ఆసక్తికర విషయాలు మీకోసం..

2032లో చంద్రుడిని గ్రహశకలం ఢీకొట్టనుందా?

Updated Date - Feb 01 , 2026 | 03:31 PM