Home » Enforcement Directorate
అల్-ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సిద్ధిఖీని ఈడీ అరెస్ట్ చేసింది. మంగళవారం అరెస్ట్ చేసిన సిద్ధిఖీని ఈ రోజు సాకేత్ కోర్టులో ఈడీ హాజరు పరిచింది.
తిరుపతి జిల్లా రేణిగుంలో చైనా దేశస్థుడి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఉంటున్న డ్యూయాంగన్ అనే చైనా దేశస్థుడి ఇంట్లో ఈడీ అధికారులు బుధవారం సోదాలు చేశారు. ఇతడిపై గతంలో వీసా ఉల్లంఘన కేసు నమోదైందని, ప్రస్తుతం ఇతను బెయిల్పై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
క్యాప్స్ గోల్డ్ కంపెనీ డైరెక్టర్ చందా శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చందా కుటుంబ సభ్యులు, డైరెక్టర్లుగా ఉన్న పలు కంపెనీల్లో కీలక ఆధారాలను ఐటీ అధికారులు సేకరించారు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు దేశంలో యువతను ఆకర్షిస్తూ, ఆర్థిక నష్టంతో పాటు చట్టపరమైన సమస్యలను సృష్టిస్తున్నాయి. దీనిపై ఫోకస్ చేసిన ఈడీ.. అలాంటి యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటోంది.
గొర్రెలు కొనకుండానే కొన్నట్టు రికార్డులు తయారీ చేశారని.. వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఏసీబీ చెబుతోంది. ఈ కేసులో పశుసంవర్ధక శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఇప్పటికే అరెస్టు కాగా.. నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీపైనా కేసు నమోదు అయ్యింది.
ఇంటరాగేషన్ నుంచి తప్పించుకునే సమయంలో జిబాన్ సహా తన మొబైల్ను మురుగు కాలువలోకి విసిరేయడంతో దానిని ఈడీ టీమ్ స్వాధీనం చేసుకుంది. ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించి తాజాగా ఈడీ రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టింది.
Congress MLA Betting Case: ఈ సోదాల్లో భాగంగా పెద్ద మొత్తంలో నగదు, బంగారం, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకుంది. ఏకంగా 12 కోట్ల నగదు దొరికింది. ఇందులో కోటి రూపాయలు విలువ చేసే ఫారెన్ కరెన్సీ కూడా ఉంది.
బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి సినీ నటీ మంచు లక్ష్మి బుఽధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మాజీ క్రికెటర్ సురేశ్ రైనా నేడు ఈడీ విచారణకు హాజరు కానున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న పలు బెట్టింగ్ యాప్ సంస్థల కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మంగళవారం ఏకకాలంలో తనిఖీలు జరిపారు.