చంద్రబాబు పాత్ర లేదు.. స్కిల్ కేసులో ఈడీ క్లారిటీ..
ABN , Publish Date - Feb 01 , 2026 | 02:47 PM
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది..
అమరావతి, ఫిబ్రవరి 1: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఎం చంద్రబాబు నాయుడికి (CM Chandrabau Naidu) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) క్లీన్ చిట్ ఇచ్చింది. రెండు రోజుల క్రితం విశాఖపట్నంలోని కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను ఈడీ దాఖలు చేసింది. ఈ కేసులో సీఎం చంద్రబాబుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కాంట్రాక్ట్‌లో చంద్రబాబు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కేసు నమోదు చేశారు.
2023 సంవత్సరంలో ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి.. దాదాపు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచింది జగన్ ప్రభుత్వం. అయితే, ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబుకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేసి, విజయవాడ ఏసీబీ కోర్టులో కేసును విత్‌డ్రా చేసుకుంది. తాజాగా ఈడీ కూడా తమ దర్యాప్తులో చంద్రబాబు పాత్ర లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో మిగతా వ్యక్తుల పాత్రపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసింది.
ఈ కేసులో ప్రభుత్వం నుంచి 10 శాతం నిధులు తీసుకుని వాటిని షెల్ కంపెనీల ద్వారా మళ్లించి పన్ను ఎగవేతకు పాల్పడ్డారని డిజైన్ టెక్, సిమెన్స్ కంపెనీల అధికారులపై కేసులు నమోదయ్యాయి. వీరిపైనే ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది ఈడీ. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన తర్వాత ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుందని అప్పట్లోనే టీడీపీ నేతలు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్.. ఓఎన్జీసీ నిర్లక్ష్యంపై స్థానికుల ఆవేదన
విజినరీ లీడర్‌కు దురదృష్టకరమైన ప్రతిపక్షం బాధాకరం: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
Read Latest AP News And Telugu News