విజనరీ లీడర్‌కు దురదృష్టకరమైన ప్రతిపక్షం బాధాకరం: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:01 PM
సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. తిరుమల లడ్డు అంశాన్ని డైవర్ట్ చేసే విధంగా వైసీపీ నేతలు వ్యవహరించారని విమర్శించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై (CM Chandrababu Naidu) వైసీపీ నేత అంబటి రాంబాబు (YCP Leader Ambati Rambabu) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎంపై అంబటి చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఖండించారు. అలాంటి కామెంట్స్ దురదృష్టకరమన్నారు. అంబటి వ్యాఖ్యలు సరికావని.. ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. చంద్రబాబు నాయుడును కాల్చి చంపాలని కామెంట్ చేశారని గుర్తుచేశారు.
అంతేకాకుండా, సీఎం కుటుంబ సభ్యులను కూడా దూషించారని ఎంపీ ఫైర్ అయ్యారు. వైసీపీ నేతల వ్యాఖ్యలు చూస్తే బాధేస్తోందన్నారు. తిరుమల లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేసే విధంగా శనివారం (జనవరి 31) వైసీపీ నేతలు వ్యవహరించారని విమర్శించారు. వ్యవస్థలను ఇబ్బందులకు గురిచేసే విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాలలో హుందాతనంగా ఉండే విధంగా రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. భావితరాలకు మన మాటలు మార్గదర్శకంగా ఉండాలి తప్ప.. తప్పుడు మార్గం కాకూడదని సూచించారు ఎంపీ.
ఒక విజనరీ లీడర్‌కు దురదృష్టకరమైన ప్రతిపక్షం ఉండటం బాధాకరమన్నారు ఎంపీ. 18 నెలల అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ నేతలకు జ్ఞానోదయం కలగాలని ఎంపీ అప్పలనాయుడు హితవు పలికారు.
ఇవి కూడా చదవండి...
ఈ-పంటలో రైతులే నమోదు చేసుకోవచ్చు
కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్.. ఓఎన్జీసీ నిర్లక్ష్యంపై స్థానికుల ఆవేదన
Read Latest AP News And Telugu News