Share News

ఈ-పంటలో రైతులే నమోదు చేసుకోవచ్చు

ABN , Publish Date - Feb 01 , 2026 | 05:40 AM

ఈ-పంట నమోదులో స్వయంగా నమోదు చేసుకోవటానికి ప్రభుత్వం రైతులకు వెసులుబాటు కల్పించిందని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ వెల్లడించారు.

ఈ-పంటలో రైతులే నమోదు చేసుకోవచ్చు

  • వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ జిలానీ వెల్లడి

అమరావతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ఈ-పంట నమోదులో స్వయంగా నమోదు చేసుకోవటానికి ప్రభుత్వం రైతులకు వెసులుబాటు కల్పించిందని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ వెల్లడించారు. శనివారం జిల్లా వ్యవసాయ, మార్క్‌ఫెడ్‌ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిలానీ మాట్లాడుతూ ‘రైతు తాను సాగు చేస్తున్న పంటలను విధిగా ఈ-పంటలో నమోదు చేసుకోవాలి. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఏపీఏఐఎంఎస్‌ 2.0 మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆధార్‌ నంబరు ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసి, ఎంపీఐఎన్‌ సెట్‌ చేసుకోవాలి. ఆధార్‌ ఆధారంగా వెబ్‌ల్యాండ్‌ (ఆర్వోఆర్‌)తో అనుసంధానమైన రైతు భూ కమతాలు యాప్‌లో కనిపిస్తాయి. ఆర్‌ఎ్‌సకే సహాయకుడు పంట నమోదు చేయని భూముల వివరాలను రైతే స్వయంగా నమోదు చేసుకోవచ్చు. పంట నమోదు సమయంలో 20 మీటర్ల జియో రిఫరెన్స్‌ హద్దులతో పొలంలో ఫొటో తీసుకోవాలి. ఇందుకోసం రైతు తప్పనిసరిగా పొలంలోనే ఉండాలి. నమోదు చేసిన సమాచారాన్ని సంబంధిత ఆర్‌ఎ్‌సకే సహాయకుడి ధ్రువీకరణ కోసం పంపుతారు. పంట నమోదు స్థితిగతులపై రైతులకూ సమాచారం ఇస్తారు. ఏపీఎయిమ్స్‌ యాప్‌ ద్వారా ఆర్‌ఎ్‌సకే సిబ్బంది వివరాలన్నీ పరిశీలించి, ఆమోదిస్తారు. వివరాలు సరిగ్గా లేకపోతే గ్రీవెన్స్‌లో నమోదుకు అవకాశం ఇస్తారు. ఈ సౌకర్యాన్ని స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న రైతులు వినియోగించుకోవచ్చు’ అని జిలానీ తెలిపారు.

Updated Date - Feb 01 , 2026 | 05:42 AM