టీటీడీ లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఈడీ ఎంట్రీ..
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:23 AM
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. వందలాది కోట్ల రూపాయలు చేతులు మారడంపై ఈడీ విచారణ చేపట్టనుంది..
తిరుమల, ఫిబ్రవరి 10: శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఈ కేసులో భారీ ఆర్థిక అక్రమాలు, మనీ లాండరింగ్ జరిగినట్లు సిట్ విచారణలో తేలడంతో పీఎంఎల్ (Prevention of Money Laundering Act) చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో వందలాది కోట్లు చేతులు మారడంపై ఈడీ విచారణ జరపనుంది. అలాగే, మనీ ట్రయల్‌పైనా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టిసారించనున్నారు.
కాగా, 2019 నుంచి 2024 వరకు టీటీడీకి సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు సీబీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో తేల్చింది. ఈ నెయ్యి విలువ సుమారు రూ. 235 కోట్లుగా అంచనా. నెయ్యి కల్తీ వ్యవహారంలో విచారణ ముగించిన సిట్.. ఛార్జ్‌షీట్‌లో 36 మందిని నిందితులుగా చేర్చింది. వారిలో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. టెండర్లలో అక్రమాలు, హవాలా మార్గాల ద్వారా లంచాలు, అక్రమ లావాదేవీలు జరిగినట్లు విచారణలో బయటపడింది. ఈ క్రమంలో ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపుపై ఈడీ విచారణ చేపట్టనుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారికి ఈడీ.. త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
భార్య, అత్తామామలే కారణం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్
హీరోయిజం చూపిస్తే.. కఠిన చర్యలు తప్పవు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక
Read Latest AP News And Telugu News