పీఎం ఉష కింద ఏపీకి రూ.378 కోట్లు
ABN , Publish Date - Feb 10 , 2026 | 05:25 AM
గత ఐదేళ్లలో పీఎం ఉష పథకం (ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్) కింద ఏపీలో 33 యూనిట్లకు ఆమోదం తెలిపామని...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో పీఎం ఉష పథకం (ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్) కింద ఏపీలో 33 యూనిట్లకు ఆమోదం తెలిపామని రూ.378.71 కోట్ల ఆర్థిక సహాయం అందించామని కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందార్ తెలిపారు. లోక్‌సభలో ఎంపీ సీఎం రమేష్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈమేరకు సమాధానమిస్తూ అనకాపల్లి నియోజకవర్గంలో రూసా, పీఎం ఉష కింద 12 యూనిట్లకు రూ.157 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.