Share News

సింగిల్‌ విండో విధానంలో రాజధానికి ఇసుక

ABN , Publish Date - Feb 10 , 2026 | 05:28 AM

రాజధాని నిర్మాణం కోసం తరలించే ఇసుకను ఎవ్వరూ ఆపకుండా, అడ్డుకోకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

సింగిల్‌ విండో విధానంలో రాజధానికి ఇసుక

  • ఎవరూ అడ్డుకోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు

అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణం కోసం తరలించే ఇసుకను ఎవ్వరూ ఆపకుండా, అడ్డుకోకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ దిశగా గనులశాఖ తక్షణ చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. సోమవారం సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఈ అంశం చర్చకొచ్చింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఇతర జిల్లాల నుంచి రాజధాని నిర్మాణం కోసం వస్తోన్న ఇసుకను అడ్డుకుంటున్నారన్న ఫిర్యాదులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజధాని పనులకోసం వచ్చే ఇసుకను ఎవ్వరూ అడ్డుకోవద్దని ఇంతకు ముందే చెప్పాం. కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం. అయినా ఈ సమస్య మళ్లీ మళ్లీ వస్తోంది? లోపం ఎక్కడుంది? ఈ విషయంలో కలెక్టర్లు, గనుల శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలి’ అని సీఎం స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణ పనులకోసం వచ్చే ఇసుక కోసం సింగిల్‌ విండో విధానం అమలు చేయాలని గనులశాఖ ముఖ్యకార్యదర్శిని ముకేశ్‌కుమార్‌ మీనాకు సూచించారు. రాజధానికోసం వచ్చే ఇసుకను అడ్డుకుంటే కఠినంగా వ్యవహరించాలని ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు కలెక్టర్లకు సూచించారు.

Updated Date - Feb 10 , 2026 | 05:29 AM