Share News

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ ముందుకు విజయసాయి రెడ్డి

ABN , Publish Date - Jan 22 , 2026 | 09:58 AM

ఏపీ లిక్కర్ స్కామ్ లో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించనుంది ఈడీ.

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ ముందుకు విజయసాయి రెడ్డి
Vijayasai Reddy

అమరావతి, జనవరి 22: ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ముమ్మరం చేసింది. మాజీ రాజ్యసభ సభ్యుడు, విజయసాయి రెడ్డి ఈరోజు (గురువారం) ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈడీ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. మద్యం పాలసీ రూపకల్పన, కోట్లాది రూపాయల అవినీతి, నగదును విదేశాలకు తరలించడం, అక్రమ షెల్ కంపెనీల ఏర్పాటు వంటి అంశాలపై ఈడీ ప్రశ్నలు సంధించనుంది.


అలాగే ఈ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని రేపు (శుక్రవారం) ఈడీ విచారణ చేయనుంది. మద్యం పాలసీ మార్పుల్లో ఆర్థిక సంబంధాలు, స్కామ్ లో ఎంపీ పాత్రపై ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ కేసుకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఎంపీని విచారించిన అనంతరం వెంటనే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణం ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈడీ విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


కాగా.. మద్యం కుంభంకోణం ఈ కేసులో రూ.3,500కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మద్యం పాలసీలో అక్రమాలు, హవాలా లావాదేవీలు, షెల్ కంపెనీల ఏర్పాటు వంటి వాటిపై ఈడీ ఆరా తీస్తోంది. ఈ స్కామ్ లో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, అధికారులు పాలుపంచుకున్నట్లు ఈడీ భావిస్తోంది. గతేడాది నుంచి ఈ కేసును విచారిస్తున్న ఈడీ.. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి, ఆస్తులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.. గుండెపోటని నాటకమాడి..

ఏడాదిన్నర తర్వాత బయటికొస్తా..!

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Jan 22 , 2026 | 10:22 AM