AP Cabinet meeting: సోమవారం భేటీ కానున్న ఏపీ కేబినేట్.. పలు కీలక అంశాలపై చర్చ..
ABN , Publish Date - Dec 28 , 2025 | 09:40 PM
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం ఆంధ్రప్రదేశ్ కేబినేట్ భేటీ కాబోతోంది. సచివాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది.
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం ఆంధ్రప్రదేశ్ కేబినేట్ భేటీ కాబోతోంది. సచివాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవిన్యూ డివిజన్లకు అమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. మార్కాపురం, మదనపల్లి, పోలవరాన్ని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లపై చర్చించనున్నట్టు తెలుస్తోంది (Andhra Pradesh Cabinet news).
అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల్లో రూ.103.96 కోట్లతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినేట్ అమోదం తెలుపనున్నట్టు సమాచారం. అలాగే అఖిల భారత సర్వీసు అధికారుల భవనాలకు అదనపు సౌకర్యాల కల్పనకు రూ.109 కోట్ల కేటాయింపు, శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణం, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు తుళ్లూరులో 6 ఎకరాలు భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది (AP government meeting).
ఎల్పీఎస్ జోన్-8లో లే-అవుట్ల అభివృద్ధికి రూ.1358 కోట్లు కేటాయింపుతో పాటు 8400 క్యూసెక్కుల కెపాసిటీతో రూ.444 కోట్లతో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకు కూడా కేబినెట్ అమోదం తెలుపనుంది (AP political news). అలాగే పలు ఇతర సంస్థలకు భూ కేటాయింపులకు కూడా కేబినేట్ అమోదం తెలుపనుంది. ఇక, విశాఖపట్నంలోని ఋషికొండ నిర్మాణాలకు సంబంధించి కూడా క్యాబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనబడుతోంది. ఇక, మెడికల్ కాలేజీ టెండర్లు, పీపీపీ విధానం పై మంత్రులకు సీఏం దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి కీలక నేతలు
ఈ ఏడాది ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి
Read Latest AP News And Telugu News