Nara Lokesh: మా ఫ్యామిలీతో పోటీ.. ఎన్నికల కంటే కష్టం: నారా లోకేష్
ABN , Publish Date - Dec 18 , 2025 | 09:45 PM
నాన్న బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. అమ్మ 'గోల్డెన్ పీకాక్' అవార్డును ఇంటికి తీసుకువస్తుంది. భారతదేశ 'వ్యాపార రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళలలో' భార్య కూడా ఉంది...
అమరావతి, డిసెంబర్ 18: ఏపీ మంత్రి నారా లోకేష్ ఇవాళ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ఆసక్తికర ట్వీట్ చేశారు. తన కుటుంబ సభ్యులకు అవార్డులు రావడంపై లోకేష్ ఎక్స్‌లో స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేయడం కంటే.. కుటుంబ సభ్యులతో పోటీ కష్టంగా ఉందని లోకేష్ సరదా వ్యాఖ్యలు చేశారు.
'నాన్న బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. అమ్మ 'గోల్డెన్ పీకాక్' అవార్డును ఇంటికి తీసుకువస్తుంది. భారతదేశంలోని 'వ్యాపార రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళలలో' భార్య కూడా ఉంది. ఈ కుటుంబంతో పోటీ పడటం.. ఎన్నికలు ఎదుర్కోవడంకన్నా కష్టమని నాకు అర్థమైంది' అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎకానమిక్ టైమ్స్ (ET) అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్‌లో 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ఈ అవార్డును అందుకున్న సందర్భంగా చంద్రబాబు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. చంద్రబాబు తన పోస్ట్‌లో ఎకానమిక్ టైమ్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
'ఈ గుర్తింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అపారమైన సామర్థ్యాన్ని, ప్రజల కష్టాన్ని ప్రతిబింబిస్తుంది. రాష్ట్రాన్ని ప్రముఖ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే నా ప్రయత్నాలకు ఇది బలమైన ఆమోదం' అని చంద్రబాబు పేర్కొన్నారు.
పెట్టుబడులు.. అభివృద్ధి సంక్షేమం, అవకాశాలు, సమగ్ర వృద్ధికి కీలకమని, ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, సంస్కరణలపై నమ్మకం ఉన్న ప్రతి వ్యాపారవేత్తకు చెందుతుందని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు పోస్ట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్‌లో రిఫార్మ్‌ల ద్వారా వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు చంద్రబాబు చేస్తున్న కృషికి గుర్తింపుగా నిలుస్తుందన్నారు.
ఇక, చంద్రబాబు పోస్ట్ ను రీట్వీట్ చేస్తూ మంత్రి నారా లోకేష్ పై విధంగా స్పందించారు.
ఇలా ఉండగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆ వివరాలు:
19-12-2025(శుక్రవారం) రాజమండ్రి సిటీ నియోజకవర్గం
ఉదయం
08.45 రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు
09.30 – 12.00 రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో నూతన భవనాల ప్రారంభోత్సవం, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం.
మధ్యాహ్నం
12.30 – 01.00 ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నూతన భవనాల ప్రారంభోత్సవం.
02.30 – 03.30 చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్ లో రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తల సమావేశం.
03.30 – 05.00 రాజమండ్రి సిటీ నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం.
Also Read:
న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!