Share News

Kanha Shanti Vanam: కన్షా శాంతి వనాన్ని దర్శించనున్న ఏపీ సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - Dec 14 , 2025 | 08:40 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం శంషాబాద్‌లోని కన్హా శాంతివనాన్ని సందర్శించబోతున్నారు. కన్హా శాంతి వనం అధ్యక్షుడు అయిన కమలేష్ డి.పటేల్ దాజీతో భేటీ కాబోతున్నారు.

Kanha Shanti Vanam: కన్షా శాంతి వనాన్ని దర్శించనున్న ఏపీ సీఎం చంద్రబాబు..
Chandrababu visit Kanha Shanti Vanam

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం శంషాబాద్‌లోని కన్హా శాంతివనాన్ని సందర్శించబోతున్నారు. కన్హా శాంతి వనం అధ్యక్షుడు అయిన కమలేష్ డి.పటేల్ దాజీతో భేటీ కాబోతున్నారు. సోమవారం ఉదయం చంద్రబాబు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి కన్హా శాంతివనం చేరుకోనున్నారు. రెండు గంటల పాటు శాంతివనంలోని వెల్ నెస్ , మెడిటేషన్ సెంటర్, యోగా కేంద్రాలను చంద్రబాబు తిలకించబోతున్నారు. (Chandrababu visit Kanha Shanti Vanam).


అలాగే శాంతి వనంలోని ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్ కేంద్రం, మెడిటేషన్ సెంటర్, బయోచార్ కేంద్రం, పుల్లెల గోపీచంద్ స్టేడియంతో పాటు హార్ట్‌ఫుల్‌నెస్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను సీఎం సందర్శిస్తారు. అనంతరం శాంతివనం వ్యవస్థాపకుడు దాజీ నివాసానికి చేరుకుంటారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో మొత్తం 1400 ఎకరాల్లో కన్హా శాంతి వనాన్ని శ్రీరామచంద్ర మిషన్ అభివృద్ధి చేసింది (Kanha Shanti Vanam news). ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ఈ ఆశ్రమంలోనే ఉంది.


ఎనిమిది లక్షలకు పైగా వివిధ జాతుల వృక్షాలతో బయోడైవర్సిటీ కేంద్రంగా ఈ ఆశ్రమం పెద్ద ఎత్తున పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది (Andhra Pradesh CM visit). అలాగే కౌశలం పేరిట శిక్షణా కార్యక్రమాలను చేపడుతోంది. ఈ శాంతి వనాన్ని సందర్శించిన తర్వాత సీఎం చంద్రబాబు హెలికాప్టర్లో బయల్దేరి అమరావతి చేరుకోనున్నారు. సచివాలయంలో అధికారులతో వేర్వేరు సమీక్షల్లో పాల్గొంటారు. సాయంత్రం విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్‌పీ భేటీ.. ఎప్పుడంటే..?

For More AP News And Telugu News

Updated Date - Dec 14 , 2025 | 08:46 PM