Wife and Lover Kill Husband: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:20 PM
మరో దారుణం జరిగింది. మూడు మూళ్లు వేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తను భార్య.. ప్రియుడితో కలిసి హత్య చేయించింది.
వికారాబాద్, డిసెంబర్ 14: చౌడాపూర్ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించింది. భర్తను ట్రాక్టర్‌తో గుద్దించి చంపి.. దానిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే మృతుడు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. చౌడాపూర్‌లో రత్నయ్య, కవిత భార్య భర్తలు. అదే గ్రామానికి చెందిన రామకృష్ణతో కవితకు పరిచయం ఏర్పడింది. ఇది వారి మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం.. భర్త రత్నయ్యకు తెలిసింది. దాంతో కవితను రత్నయ్య మందలించాడు.
దీంతో తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న రత్నయ్యను హత్య చేసేందుకు కవితతోపాటు ఆమె ప్రియుడు రామకృష్ణ పథకం పన్నారు. ఉదయం పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్న రత్నయ్యను రామకృష్ణ ట్రాక్టర్‌తో బలంగా ఢీ కొట్టాడు. తీవ్రగాయాలతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తొలుత ప్రమాదంలో రత్నయ్య మరణించారని పోలీసులు భావించారు.
రత్నయ్య మృతిపై అతడి సోదరుడు పోలీసుల ఎదుట సందేహం వ్యక్తం చేశాడు. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య కవిత, ప్రియుడు రామకృష్ణ అక్రమ సంబంధం బయట పడింది. తమ అక్రమ సంబంధానికి అడ్డోస్తున్నాడని భర్త రత్నయ్యను ప్రియుడి రామకృష్ణతో కలిసి హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నేరం అంగీరించారు. దాంతో వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం రత్నయ్య మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్‌పీ భేటీ.. ఎప్పుడంటే..?
For More TG News And Telugu News