MDMA Seize In Hyderabad: లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్
ABN , Publish Date - Dec 14 , 2025 | 04:58 PM
హైదరాబాద్‌లో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (HNEW), మాసబ్ ట్యాంక్ పోలీసుల సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా MDMA విక్రయిస్తున్న పేడ్లర్ ఒకరు, ఇద్దరు సబ్-పేడ్లర్లను వారు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 14: మహానగరంలో డ్రగ్స్ వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. వీటికి బానిసలవుతున్న వారి సంఖ్య అంతకంతకు రెట్టింపు అవుతోంది. డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎప్పుడో అప్పుడు ఏదో ఒక ప్రాంతంలో డ్రగ్స్ పట్టుబడుతునే ఉన్నాయి. అలాంటి వేళ.. ఆదివారం హైదరాబాద్‌లో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (HNEW), మాసబ్ ట్యాంక్ పోలీసుల సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా MDMA విక్రయిస్తున్న పేడ్లర్ ఒకరు, ఇద్దరు సబ్-పేడ్లర్లను వారు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 11 గ్రాముల MDMA డ్రగ్స్‌తోపాటు మూడు మొబైల్ ఫోన్లు, బైక్, కారు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న ఈ డ్రగ్స్ విలువు రూ. 4.65 లక్షలు ఉంటుందని HNEW అధికారులు చెప్పారు. ఈ MDMA డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు తమ విచారణలో వెల్లడించినట్లు తెలిపారు. నిందితులు కార్తీక్ అలియాస్ అలెక్స్, బాలాజీ, దీపక్‌గా గుర్తించామన్నారు. 1 గ్రాము MDMA డ్రగ్స్‌ను సాచెట్లుగా ప్యాకింగ్ చేసి విక్రయించినట్టు వారు తెలిపారని వెల్లడించారు.
ప్రస్తుతం బాలాజీ గతంలో NDPS కేసులో నిందితుడిగా ఉన్నారని HNEW అధికారులు తెలిపారు. ఈ కేసులో అతడు అరెస్ట్ అయి.. ఆ తర్వాత విడుదలై మళ్లీ ఈ డ్రగ్స్ వ్యాపారంలోకి వెళ్లాడని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో NDPS చట్టం కింద మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిందని వెల్లడించారు. అప్రమత్తంగా ఉండాలంటూ ఈ సందర్భంగా యువతకు HNEW అధికారులు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్‌పీ భేటీ.. ఎప్పుడంటే..?
For More TG News And Telugu News