Share News

CM:24న నగరికి ముఖ్యమంత్రి రాక

ABN , Publish Date - Jan 21 , 2026 | 02:57 AM

నగరిలో జనవరి 24వ తేదీ నిర్వహించనున్న స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు.

CM:24న నగరికి ముఖ్యమంత్రి రాక
నగరి జూనియర్‌ కళాశాల ఆవరణలో కలెక్టర్‌తో చర్చిస్తున్న ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌

నగరి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): నగరిలో జనవరి 24వ తేదీ నిర్వహించనున్న స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై కలెక్టర్‌ సమిత్‌కుమార్‌, ఎమ్మెల్యే గాలి భానుప్రకా్‌ష మంగళవారం నగరి టీడీపీ కార్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, చింతలపట్టెడ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేసి డిగ్రీ కళాశాలలో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో సీఎంవో అధికారులతో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి సమావేశం జరిగే స్థలాన్ని రెండు రోజుల్లో నిర్ణయించనున్నారు. ఆర్డీవో అనుపమ,మున్సిపల్‌ కమిషనర్‌ బాలాజీ నాయక్‌, తహసీల్దార్లు రవికుమార్‌, కిరణ్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు బాలాజి, శ్రీధర్‌, సలీం, తేజ, మురళి, తేజరాము, మదన్‌కుమార్‌, నారాయణస్వామి నాయుడు, లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 02:57 AM