Mallareddy Land Issue: భూవివాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. అధికారుల సర్వే.. హైటెన్షన్
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:07 AM
మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. దీంతో రెవెన్యూ అధికారులు అధికారికంగా భూ సర్వే చేపట్టడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
హైదరాబాద్, డిసెంబర్ 9: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లా రెడ్డి (Malla Reddy), మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajasekhar Reddy) మరోసారి భూమి వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ జిల్లా సుచిత్ర సెంటర్‌లో కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. సర్వే నంబర్ 82, 83లో 1.29 ఎకరాల్లో 33 గుంటల స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో తమ భూములు కబ్జా చేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇక భూ వివాదం నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఈరోజు (మంగళవారం) అధికారికంగా ల్యాండ్ సర్వే చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే కొనసాగుతోంది. అయితే కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ తమ స్థలాన్ని కాజేసే కుట్ర చేస్తున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. కాగా.. సర్వే విషయం తెలిసిన వెంటనే మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి అనుచరులు ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. అయితే సర్వే జరుగుతున్న ప్రాంతం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు లోపలికి అనుమతించని పరిస్థితి. ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. దీంతో సుచిత్ర సెంటర్ వివాదాస్పద భూమి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి...
అమెరికా టూర్‌లో లోకేష్ బిజీ.. ఓప్స్ ర్యాంప్ సీఈవోతో కీలక చర్చలు
హై అలర్ట్.. తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు..
Read Latest Telangana News And Telugu News