Mallareddy Diwali Celebration: కుటుంబ సభ్యులతో మల్లారెడ్డి దీపావళి సంబరాలు

ABN, Publish Date - Oct 20 , 2025 | 09:38 PM

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దివాళి వేడుకను ఘనంగా చేసుకున్నారు. మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ఇంటి బయట టపాసులు పేలుస్తూ మల్లారెడ్డి ఉత్సాహంగా గడిపారు.

దేశ వ్యాప్తంగా దీపావళి(Diwali Festival) సందడి మొదలైంది. ప్రజలందరూ టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ దీపావళి వేడుకను ధూమ్ ధామ్ గా జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండగను సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇక మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దివాళి(Mallareddy Diwali Celebration) వేడుకను ఘనంగా చేసుకున్నారు. మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ఇంటి బయట టపాసులు పేలుస్తూ మల్లారెడ్డి ఉత్సాహంగా గడిపారు. తన సతీమణితో కలిసి లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక మల్లారెడ్డి క్రాకర్స్ కాలుస్తూ ఉంటే.. ఆ సంబరాల్లో కొడుకులు, కోడళ్లు కూడా పాల్గొన్నారు. మొత్తంగా మల్లన్న తనదైన స్టైల్లో దివాళి వేడుకలను అంబరాన్ని అంటేలా జరుపుకున్నారు.


ఇవి కూడా చదవండి:

నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన.. కొనసాగుతున్న పెట్టుబడుల వేట..

Hyderabad Diwali Celebrations: హైదరాబాద్‌లో ఆకట్టుకున్న దీపావళి సంబరాలు

Updated at - Oct 20 , 2025 | 09:45 PM