Share News

Nara Lokesh Australia Visit: నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన.. కొనసాగుతున్న పెట్టుబడుల వేట..

ABN , Publish Date - Oct 20 , 2025 | 07:36 PM

ఏపీకి పెట్టుబడులే ధ్యేయంగా, విద్యా వ్యవస్థను మరింత ఆధునీకరించడమే ప్రధాన లక్ష్యంగా మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సాగుతోంది. యూఎన్‌ఎస్‌డబ్ల్యూ సందర్శించిన లోకేష్‌కు యూనివర్సిటీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

Nara Lokesh Australia Visit: నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన.. కొనసాగుతున్న పెట్టుబడుల వేట..
Nara Lokesh Australia Visit

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన దీపావళి పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకున్నారు. పండుగ రోజును ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షించటం కోసం గడిపేశారు. రెండో రోజు పర్యటనలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్‌ను మంత్రి నారా లోకేష్ సందర్శించారు. అనంతరం పర్యటనకు సంబంధించిన వివరాలను ఎక్స్ వేదికగా తెలియజేశారు. ‘నేను యూనివర్శిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌ను సందర్శించాను.


అధునాతన బోధనా పద్ధతులపై సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, పరిశోధకులతో చర్చించాను. ఏపీ వర్సిటీలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు ప్రారంభించాలని.. స్టెమ్, ఏఐ, రెన్యువబుల్ ఎనర్జీపై నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించాలని కోరాను’ అని పేర్కొన్నారు. మరో పోస్టులో..‘సిడ్నీలోని ఆస్ట్రేలియా, ఇండియా సీఈఓ ఫోరమ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాను. ఆస్ట్రేలియాలోని టాప్ వ్యాపారవేత్తలను కలిశాను. ఆంధ్రప్రదేశ్ 16 నెలల్లోనే 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఎలా ఆకర్షించిందో వారికి వివరించాను.


అమెజాన్, సిస్కో, ఈవై, గ్రెయిన్ కార్ప్, హెచ్‌సీఎల్ టెక్, కేపీఆర్ఎమ్, మాస్టర్‌కార్డ్ కంపెనీలకు చెందిన ఎగ్జిక్యూటివ్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. గూగుల్ రిప్రెసెన్‌టేటివ్ అలెక్స్‌ను కూడా కలిశాను. ఆయన ఏపీలో పెట్టబోయే ప్రాజెక్ట్ గురించి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. వీళ్లందరినీ నవంబర్ నెలలో జరగబోయే పార్ట్‌నర్‌షిప్ సమిట్‌లో మళ్లీ కలుస్తా’ అని రాసుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

పక్కన పెట్టిన గత వైసీపీ సర్కారు.. శిథిలావస్థలో ఈ-ఆటో

రెయిన్ అలర్ట్ .. రేపు ఆ జిల్లాలో భారీ వర్షాలు

Updated Date - Oct 20 , 2025 | 08:51 PM