Share News

AP Rain Alert: రెయిన్ అలర్ట్ .. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..

ABN , Publish Date - Oct 20 , 2025 | 06:42 PM

దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

AP Rain Alert: రెయిన్ అలర్ట్ .. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..
Raine Alert

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ ప్రభావంతో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు పడుతున్నాయి. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలూ దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ వాసులకు మరో రెయిన్ అలర్ట్ వచ్చింది. మంగళవారం నాడు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(AP Disaster Management) తెలిపింది.


దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ(AP Disaster Management) తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలానే రానున్న 48 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ -వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండం(Bay of Bengal Low Pressure)గా బలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.


మంగళవారం నాడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి (AP Rain Alert)జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మిగతా జిల్లాల్లోనూ పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షం కురిసే సమయంలో ప్రజలు పొలాల్లో, చెట్ల కింద ఉండొద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని(IMD Alert) అధికారులు సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయండి..లోకేష్ పిలుపు

కొత్త అల్లుడికి మామ అదిరిపోయే సర్‌ప్రైజ్.. ఇట్స్ వెరీ స్వీట్

Updated Date - Oct 20 , 2025 | 08:09 PM