Diwali 2025 in Vijayawada: దీపావళి వేళ మార్కెట్లోకి కొత్త కొత్త టపాసులు
ABN , Publish Date - Oct 20 , 2025 | 05:51 PM
పాత తరానికి పరిచయమైన మందుగుండు సామగ్రితో పాటు, నేటి తరం ఆలోచనలకు అనువైన టపాసులను ఈ దీపావళికి మార్కెట్లోకి వచ్చాయి. దీపావళి పండుగకు కళను తీసుకొచ్చే క్రాకర్స్ దుకాణాలు నగరంలో పలుచోట్ల ఏర్పాటయ్యాయి.
ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీ: స్మార్ట్ ఫోన్‌కు మాత్రమే పరిమితమైన ఆండ్రాయిడ్ ఈ దీపావళికి వెలుగులు నింపనుంది. గాలిలో ఎగిరి వీడియో షూట్ చేసే డ్రోన్లు ఆకాశం నుంచి కాంతిని విరజిమ్మేందుకు సిద్ధమయ్యాయి. హెలికాప్టర్ సౌండ్ చేస్తూ ఆకాశానికి రంగులద్దే తారాజువ్వలు ఈ దీపావళికి సందడి చేయనున్నాయి. నేటి కాలంలో టెక్నాల జీని, వినోదాన్ని అందించే ప్రతి యూనిట్, వస్తువు దీపావళి టపాకులు రూపాన్ని సంతరించుకుంది. మారుతున్న జీవన శైలి, దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతికతను క్రాకర్స్ తయారీదారులు అందిపుచ్చుకున్నారు. యువత, చిన్నారుల అభిరుచికి అనుగుణంగా బాణాసంచాను సిద్ధం చేశారు.
పాత తరానికి పరిచయమైన మందుగుండు సామగ్రితో పాటు, నేటి తరం ఆలోచనలకు అనువైన టపాసులను ఈ దీపావళికి మార్కెట్లోకి వచ్చాయి. దీపావళి పండుగకు కళను తీసుకొచ్చే క్రాకర్స్ దుకాణాలు నగరంలో పలుచోట్ల ఏర్పాటయ్యాయి. లబ్బీపేటలోని వజ్రా గ్రౌండ్స్, సెంట్రల్ నియోజకవర్గం(Vijayawada markets)లోని ఘంటసాల సంగీత కళాశాల, సింగ్‌నగర్‌లోని మారినేని బసవ పున్నయ్య స్టేడియం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఆర్టీసీ వర్క్ షాప్ ప్రాంగణాల్లో రీటైల్ దుకాణాల ఏర్పాటుకు(Vijayawada Diwali) ప్రభుత్వం అనుమతించింది. ఆయా ప్రాంతాల్లో ఆదివారం ఉదయమే ఏర్పాటైన దుకాణాల వద్ద ప్రజల తాకిడి మొదలైంది. వీటితో పాటు భవానీ పురం, గొల్లపూడి ప్రాంతాల్లోని హోల్ సేల్ షాపుల్లోనూ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
నేటితరం వారి మనసుకు హత్తుకునేలా ఈ ఏడాది మార్కెట్లోకి కొత్తగా టపాసులు చేరాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మందుగుండు సామగ్రిని తయారు చేయడంలో నిష్ణాతులైన తయారీ దారులను వ్యాపారస్తులు ఈ ఏడాది రంగంలోకి దింపి ప్రజలను ఆకర్షిస్తున్నారు. నేటి సమాజానికి అవసరమైన వస్తువుల జాబితాలో చేరిన డ్రోన్ ఆకారం మందుగుండు సామగ్రి బాణాసంచా దుకాణాల్లో కనిపిస్తుంది. డ్రోన్ ఆకారంలో(Drone Crackers) పైకి ఎగురుతూ వెలుగు విరజిమ్మేలా తయారు చేశారు. అలానే హెలికాప్టర్( Helicopter Crackers) మందుగుండు సామగ్రికి వాడారు. గృహాల్లోనూ, వ్యాపార సముదాయాల్లో కనిపించే లాఫింగ్ బుద్దా సైతం టపాకుల అట్ట పెట్టెల పైకి ఎక్కింది.
ఈ బాణా సంచా వెలిగించగానే లాఫింగ్ బుద్ధా వలే నవ్వుకుంటూ ఎగిరెగిరి పడుతుందని దుకాణం యజమానులు చెబుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాలర్ ఆకారంలోనూ బాణాసంచా అందుబాటులోకి వచ్చాయి. పాప్ కార్న్ ఆకారంలో వెలుగులు జిమ్మే పాప్ కార్న్ క్రాకర్స్(Diwali Fireworks), సూర్య వెలుగుల వలే ఉండే సన్రా డ్రాప్ చిచ్చుబుడ్లు, స్నాప్ అప్ తారాజువ్వలు, బెంజ్ 5000 వాలా, రెడ్ పోర్ట్ 1000 వాలా, చిన్నారులను ఆశ్చర్యానికి గురి చేసే మ్యాజిక్ గన్స్, ఏమోజీని పోలి ఉండే తారాజువ్వలు, కాల్ ఫైర్ వర్క్స్, క్రేజీ వీల్స్ భూ చక్రాలు, ధూమ్ ధామ్ చిచ్చుబుడ్లు ఈ దీపావళికి(Diwali Festival) సందడి చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ భేటీ