Share News

Yanamala Slams Jagan: డీఏపై జగన్‌ను నిలదీసిన యనమల

ABN , Publish Date - Oct 20 , 2025 | 12:21 PM

ఉద్యోగుల సంఘం డిమాండ్లను వైసీపీ పూర్తిగా విస్మరించిందని యనమల వ్యాఖ్యలు చేశారు. వారి సమస్యల గురించి వారితో ఎప్పుడూ చర్చలు జరపలేదని మండిపడ్డారు.

Yanamala Slams Jagan: డీఏపై జగన్‌ను నిలదీసిన యనమల
Yanamala Slams Jagan

అమరావతి, అక్టోబర్ 20: దీపావళి బహుమతిగా ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వడం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం లేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నాలుగు డీఏలు ఎందుకు ఇవ్వలేకపోయిందో కనీసం ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేకపోయిందో జగన్ లేదా అతని అనుచరులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ అప్పుడు పీఆర్సీని ఎందుకు ప్రకటించలేకపోయారని నిలదీస్తూ.. ఐఆర్‌ కూడా ఇవ్వలేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపించారు.


ఉద్యోగుల సంఘం డిమాండ్లను పూర్తిగా విస్మరించిందని వ్యాఖ్యలు చేశారు. వారి సమస్యల గురించి వారితో ఎప్పుడూ చర్చలు జరపలేదని మండిపడ్డారు. ఇప్పుడు ఉద్యోగులను రెచ్చగొట్టేందుకు జగన్, అతడి అనుచరులు మొసలి కన్నీరు కార్చడం ప్రారంభించారంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో మరింత స్నేహపూర్వకంగా, అనుకూలంగా ఉంటుందని స్పష్టం చేశారు.


జగన్ ప్రభుత్వం సృష్టించిన అన్ని సంక్షోభాలను సరిదిద్దడానికి ఈ ప్రభుత్వం దృఢంగా ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. అయితే జగన్ పార్టీ మాత్రం రాజకీయాల్లో రోజురోజుకూ తీవ్ర ఇబ్బందుల్లో పడుతోందని.. దాన్నుంచి బయటపడలేకపోతోందని యనమల రామకృష్ణులు వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి

కొత్త అల్లుడికి మామ అదిరిపోయే సర్‌ప్రైజ్.. ఇట్స్ వెరీ స్వీట్

పండగ వేళ.. ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 20 , 2025 | 03:58 PM