Share News

Food poisoning incident: ఏపీ ఫుడ్ పాయిజన్ ఘటన.. హోటల్‌ను సీజ్ చేసిన అధికారులు

ABN , Publish Date - Oct 20 , 2025 | 12:11 PM

కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరంలో ఫుడ్ పాయిజన్ 20 మందికి పైగా అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.

Food poisoning incident: ఏపీ ఫుడ్ పాయిజన్ ఘటన.. హోటల్‌ను సీజ్ చేసిన అధికారులు
Food poisoning incident

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 20: ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరంలో ఫుడ్ పాయిజన్ 20 మందికి పైగా అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. అంబాజీపేట లోని పట్టాభి రామయ్య టిఫిన్ హోటల్లో కలుషితమైన టిఫిన్ చేసిన 20 మందికి అస్వస్థత గురయ్యారు. దీంతో హోటల్ ను తనిఖీ చేసిన అధికారులు..హోటల్ ను మూసి వేశారు. కొన్ని రోజుల క్రితం పట్టాభిరామయ్య టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసిన వారికి వాంతులు విరోచనాలు అవ్వడంతో ఆస్పత్రిలో వారిని ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాధితులు చికిత్స తీసుకుంటున్నారు.

Updated Date - Oct 20 , 2025 | 03:40 PM