AP Govt Gifts: పండగ వేళ.. ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
ABN , Publish Date - Oct 20 , 2025 | 11:52 AM
2024 జనవరి 1 నుంచి డీఏను 3.64% పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. డీఏ పెంపు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
అమరావతి, అక్టోబర్ 20: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (AP Govt Employees) అదిరిపోయే న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి పండగ కానుకను అమలులోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం (AP Govt). ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం ఈరోజు (సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి 1 నుంచి డీఏను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. డీఏ పెంపు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
పెన్షనర్లు/ కుటుంబ పెన్షనర్లకు చెల్లించాల్సిన డియర్నెస్ రిలీఫ్ (DR) 3.64% పెంచింది ప్రభుత్వం. 2024 జనవరి 1 నుంచి అమలులోకి రానున్న 3.64 శాతం డీఆర్ పెంపుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీసీఎఫ్ ఎంఎస్ సీఈవోని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే కొత్త డీఏతో పాటు బకాయిలు కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా.. ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా... జగన్ ప్రభుత్వ హయాంలో బకాయి పెట్టిన డీఏలలో ఒకటి విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం దీపావళి రోజు ఒక డీఏ విడుదల చేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయండి..లోకేష్ పిలుపు
కొత్త అల్లుడికి మామ అదిరిపోయే సర్‌ప్రైజ్.. ఇట్స్ వెరీ స్వీట్
Read Latest AP News And Telugu News