Lokesh Australia Visit: ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయండి..లోకేష్ పిలుపు
ABN , Publish Date - Oct 20 , 2025 | 10:28 AM
ఏపీ వర్సిటీలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు ప్రారంభించామని.. స్టెమ్, ఏఐ, రెన్యువబుల్ ఎనర్జీపై నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించాలని మంత్రి లోకేష్ కోరారు.
అమరావతి , అక్టోబర్ 20: రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ (UNSW)ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా అధునాతన బోధనా పద్ధతులపై సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, పరిశోధకులతో భేటీ అయ్యారు లోకేష్. ఏపీ వర్సిటీలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు ప్రారంభించాలని.. స్టెమ్, ఏఐ, రెన్యువబుల్ ఎనర్జీపై నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. రెన్యువబుల్ ఎనర్జీ పరిశోధనలపై ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.
రాష్ట్రానికి పెట్టుబడులే ధ్యేయంగా, విద్యా వ్యవస్థను మరింత ఆధునీకరించడమే ప్రధాన లక్ష్యంగా మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సాగుతోంది. యూఎన్‌ఎస్‌డబ్ల్యూ సందర్శించిన లోకేష్‌కు యూనివర్సిటీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అలాగే అధినాతన బోధనా పద్దతులు, టీచర్స్ ట్రైనింగ్, రెన్యువబుల్ ఎనర్జీ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ప్రత్యేకంగా లోకేష్‌కు వివరించారు. ఇక్కడున్న బోధనా విధానాన్ని ఏపీలో ప్రవేశపెట్టాలని, వివిధ రంగాల్లో ఏపీలో ఉన్న వర్సిటీలతో కలిసి పనిచేయాలని లోకేష్ కోరడం పట్ల యూనివర్సిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తమ నిర్ణయాలను అతి త్వరలోనే తెలియజేస్తామని మంత్రి చెప్పారు.
కాగా... తొలిరోజు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అక్కడి తెలుగు వారిని కలిసిన లోకేష్.. ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని కోరారు. రెండోరోజు యూనివర్సిటీలపై దృష్టిపెట్టిన మంత్రి లోకేష్ వివిధ యూనివర్సిటీలను సందర్శించబోతున్నారు.
ఇవి కూడా చదవండి
కొత్త అల్లుడికి మామ అదిరిపోయే సర్‌ప్రైజ్.. ఇట్స్ వెరీ స్వీట్
Read Latest AP News And Telugu News