Share News

Nuzvid Constituency: ఎక్సైజ్‌ విస్తృత తనిఖీలు

ABN , Publish Date - Oct 20 , 2025 | 05:52 AM

నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మం డలం, ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరం నియోజకవర్గ సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో ఏలూరు జిల్లా ఎక్సైజ్‌ అధికారులు...

Nuzvid Constituency: ఎక్సైజ్‌ విస్తృత తనిఖీలు

నూజివీడు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మం డలం, ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరం నియోజకవర్గ సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో ఏలూరు జిల్లా ఎక్సైజ్‌ అధికారులు ఆదివారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఎన్టీఆర్‌ జిల్లా సూరంపల్లిలో ఒక ప్రైవేట్‌ గోడౌన్‌లో నకిలీ మద్యం దొరకడం, శనివారం గన్నవరంలోని వైన్‌షాపులో నకిలీ మద్యం బాటిళ్లుగా భావిస్తున్న వాటిపై వినియోగదారులు ప్రశ్నించటం వంటి ఘటనల నేపథ్యంలో.. ‘నూజివీడు ప్రాంతంలో నకిలీ మద్యం?’ శీర్షికన ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఎక్సైజ్‌ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నూజివీడు-గన్నవరం నియోజకవర్గాల సరిహద్దుల్లోని అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు చేసినట్టు, నకిలీ మద్యం బాటిళ్లు లభ్యం కాలేదని నూజివీడు ఎక్సైజ్‌ సీఐ ఎ. మస్తానయ్య తెలిపారు.

Updated Date - Oct 20 , 2025 | 05:52 AM