Share News

Telugu Family Traditions: కొత్త అల్లుడికి మామ అదిరిపోయే సర్‌ప్రైజ్... ఇట్స్ వెరీ స్వీట్

ABN , Publish Date - Oct 20 , 2025 | 09:46 AM

పెళ్లైన తరువాత వచ్చే పండుగలకు కొత్త అల్లుళ్లకు అత్తింటి వారు జరిపే మర్యాదలు అంతా ఇంతా కాదు. సాధారణంగా సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుళ్లకు కొత్త రకాల వంటకాలను రుచి చూపించడం జరుగుతుంది.

Telugu Family Traditions: కొత్త అల్లుడికి మామ అదిరిపోయే సర్‌ప్రైజ్... ఇట్స్ వెరీ స్వీట్
Telugu Family Traditions:

పశ్చిమగోదావరి, అక్టోబర్ 20: కొత్త అల్లుడికి సరికొత్త వంటకాలతో స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు అత్తింటి వారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. గోదావరి జిల్లాలంటేనే ఆతిధ్యానికి పెట్టింది పేరు. ఇక పండుగలకు కొత్త అల్లుడు ఇంటికి వస్తే వారి ఆతిథ్యం అబ్బురంగా ఉంటుంది. కొత్త అల్లుడికి వివిధ రకాల వంటకాలు, కొత్త బట్టలు ఇచ్చి ఆనందపరుస్తుంటారు. కొన్ని చోట్ల అల్లుడికి వంద రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తుంటారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోనూ తులసీ రాంబాబు అనే వ్యక్తి తన అల్లుడికి పసందైన భోజనాలతో కడుపునింపేశాడు. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


పెళ్లైన తరువాత వచ్చే పండుగలకు కొత్త అల్లుళ్లకు అత్తింటి వారు జరిపే మర్యాదలు అంతా ఇంతా కాదు. సాధారణంగా సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుళ్లకు కొత్త రకాల వంటకాలను రుచి చూపించడం జరుగుతుంది. అలాగే దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కూడా కొందరు తమ అల్లుళ్లకు అదిరిపోయే అతిథ్యం ఇస్తుంటారు. జిల్లాకు చెందిన తులసీ రాంబాబు అనే వ్యక్తి కూడా తన అల్లుడికి వివిధ రకాల కమ్మనైన వంటకాలను రుచి చూపించాడు. వంటకాలు అంటే ఒకటో రెండో అనుకునేరు ఏకంగా 200 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేసి అల్లుడిని ఆశ్చర్యపోయేలా చేశాడు.


జిల్లాలోని వీరనాసరం గ్రామానికి చెందిన తులసీ రాంబాబు.. ఇటీవల తన కుమార్తెకు వివాహం జరిపించాడు. వీరవాసరం కు చెందిన తులసీ రాంబాబు దంపతులు తన కుమార్తె గోవర్దినిని విశాఖపట్నానికి చెందిన రాహుల్‌కు ఇచ్చి ఈ నెల 11 వ తేదీన ఘనంగా వివాహం జరిపించారు. పెళ్ళైన తరువాత తొలిసారిగా దీపావళి పండగకి ఇంటికి వచ్చాడు అల్లుడు రాహుల్. ఇక ఏముంది తమదైన స్టైల్లో మర్యాదలతో అత్తింటి వారు కొత్త అల్లుడిని ముంచెత్తారు.


దీపావళికి వచ్చిన అల్లుడు కోసం వంద రకాల నాన్ వెజ్ రకాలు, వెజ్, పిండి వంటలు, స్వీట్స్ కలిపి మరో వంద రకాలు మొత్తం రెండు వందల రకాల వంటకాలను తయారు చేయించారు తులసీ రాంబాబు. వంద రకాల నాన్ వెజ్ ఐటమ్స్ చూసి అల్లుడు రాహుల్ ఆశ్చర్యపోయాడు. 100 రకాల నాన్ వెజ్ వెరైటీలతో కలిపి మొత్తం 200 వందల రకాల వంటకాలను అల్లుడు రాహుల్, కుమార్తె గోవర్దినికి తులసీ రాంబాబు స్వయంగా వడ్డించారు.‌ ఇన్ని రకాల వంటకాలను చూసిన అల్లుడు ఆశ్చర్యానికి గురైయ్యాడు. ఇటువంటి మర్యాదను ఎప్పుడూ చూడలేదని, తన మామగారికి థ్యాంక్స్ చెప్పాడు. గోదావరి వాసులు ‌మర్యాద అంటేనే ఆప్యాయతతో ఉంటుందని తొలిసారి ‌దీపావళి పండుగకు వచ్చిన కొత్త అల్లుడికి అన్ని రకాల వంటలతో విందు ఏర్పాటు చేశాననీ అన్నారు తులసీ రాంబాబు. మొదటి సారిగా దీపావళి పండగకి అల్లుడిని, కూతురిని ఇంటికి తీసుకువచ్చాని, అల్లుడిని సర్ప్రైజ్ చేసేందుకు ఎక్కువ నాన్ వెజ్ రకాలు వంటకాలు ఏర్పాటు చేస్తానని తులసీ రాంబాబు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

మళ్లీ విస్తారంగా భారీ వర్షాలు

ముస్లింలకు అట్రాసిటీ చట్టం తీసుకురావాలి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 20 , 2025 | 10:15 AM