Heavy Rains: మళ్లీ విస్తారంగా భారీ వర్షాలు
ABN , Publish Date - Oct 20 , 2025 | 08:06 AM
బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండం కారణంగా.. భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 20: రానున్న నాలుగు రోజుల అనంతరం దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఇది మంగళవారం నాటికి అంటే రేపటికి అల్పపీడనంగా బలపడి, ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది.
అయితే అక్టోబర్ 20న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి.. అలాగే 21వ తేదీన పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి.. ఇక 22వ తేదీన బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు,గుంటూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తునే ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు ప్రజలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దీపావళి శుభాకాంక్షలు
మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు
For More AP News And Telugu News