NTR district Students Missing: విద్యార్ధులు మిస్సింగ్.. తెల్లార్లు శ్రమించి గుర్తించిన పోలీసులు
ABN , Publish Date - Oct 20 , 2025 | 11:31 AM
విద్యార్థుల ఆచూకీ కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఎట్టకేలకు విద్యార్థులు సురక్షితంగా ఉండడంతో పోలీసులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా, అక్టోబర్ 20: ముగ్గురు గురుకుల విద్యార్థుల జీవితాల్లో దీపావళి వెలుగులను నింపారు పోలీసులు. అదృశ్యమైన విద్యార్థుల కోసం పోలీసులు రాత్రింబవళ్లు శ్రమించి ఎట్టకేలకు వారిని కనుగొన్నారు. తిరువూరు డా.బిఆర్ అంబేద్కర్ గురుకులంలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు ఆచూకీ లభ్యమైంది. విజయవాడ వెళ్లే రోడ్డులోని హై లెవెల్ బ్రిడ్జి కింద ముగ్గురు విద్యార్థులను కాప్స్ గుర్తించారు. విద్యార్థుల ఆచూకీ కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఎట్టకేలకు విద్యార్థులు సురక్షితంగా ఉండడంతో పోలీసులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులను కనుగొన్న పోలీసులకు విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
కాగా.. జిల్లాలోని తిరువూరులోని డా. బీ ఆర్ అంబేడ్కర్ గురుకులంలో ముగ్గురు విద్యార్ధులు అదృశ్యం తీవ్ర కలకలం రేపింది. ఏ. కొండూరు మండలం గొల్లమందల గ్రామానికి చెందిన అన్నదమ్ములైన 6, 7 తరగతి చదువుతున్న మంకెన రిత్విక్ సాయి మణికంఠ, చంద్రశేఖర్.. ఏ. కొండూరు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్ధి ఉల్లింద్ర సాయిగణేష కనిపించకుండా పోయారు. నిన్న (ఆదివారం) సాయంత్రం నుంచి విద్యార్ధులు కనిపించకపోవటంతో ఉపాధ్యాయులు గాలించారు. అయినప్పటికీ వారి ఆచూకీ లభించకపోవడంతో రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు పాఠశాల ఉపాధ్యాయులు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు.. గురుకుల పాఠశాలకు చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రాత్రంతా గాలించగా... ఎట్టకేలకు ఆ ముగ్గురు విద్యార్ధుల ఆచూకీ లభించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయండి..లోకేష్ పిలుపు
కొత్త అల్లుడికి మామ అదిరిపోయే సర్‌ప్రైజ్.. ఇట్స్ వెరీ స్వీట్
Read Latest AP News And Telugu News