Hyderabad Diwali Celebrations: హైదరాబాద్‌లో ఆకట్టుకున్న దీపావళి సంబరాలు
ABN , Publish Date - Oct 20 , 2025 | 08:59 PM
రెండు తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి షూరు అయింది. హైదరాబాద్ మహానగరంలో కూడా ప్రజలు దీపావళి వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. సోమవారం సాయంత్రం భాగ్యనగరంలో టపాసుల మోతలు మారుమ్రోగుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి షూరు అయింది. హైదరాబాద్ మహానగరంలో(Hyderabad Diwali Celebrations) ప్రజలైతే దీపావళి వేడుకను ధూమ్ ధామ్ గా జరుపుకుంటున్నారు. ఉదయం నుంచే షాపులు, ఇళ్లను వివిధ రకాల పూలు, విద్యుత్ దీపాలతో అలకరించారు. పిల్లలు, మహిళలు, కొత్త దుస్తులు ధరించి దేవాలయాలకు సందర్శించి.. ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఇక సాయంత్రం వేళ ఇళ్ల ముందు పిల్లలు, యువత క్రాకర్స్(Fireworks) కాలుస్తూ దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు.
సోమవారం నాడు హైదరాబాద్ నగరంలో దీపావళి సంబరాలు(Diwali Celebrations) అంబరాన్ని అంటాయి. వాడ వాడల్లో బాంబుల మోతలు మోగుతున్నాయి. సాయంత్ర వేళ దేవుళ్లకు దీపారాధనలు చేసిన అనంతరం నగర వాసులు అసలు కార్యక్రమాన్ని షూరు చేశారు. చిచ్చు బుడ్డులు, తారాజువ్వలు, పటాసులు, థౌజండ్ వాలాస్ వంటి అనేక రకాల బాంబులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇలా ఎంతో సరదాగా దీపావళి వేడుక జరుపుకుంటూ తమ జీవితాల్లో వెలుగు నింపాలని ప్రజలు కోరుకున్నారు. పలు చోట్ల అయితే పెద్ద సంఖ్యలో క్రాకర్స్ పేలుస్తూ యువతి, యువకులు తెగ ఎంజాయ్ చేశారు. ఇదే సమయంలో పెద్దలు దగ్గర ఉండి పిల్లల చేత టపాసులు కాలిపిస్తూ..సంతోషంగా గడుపుతున్నారు. డ్రోన్ , హెలికాప్టర్ట్, లాఫింగ్ బుద్దా వంటి వివిధ క్రాకర్స్ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.
సోమవారం సాయంత్రం 5 గంటలకు మొదలైన దీపావళి సందడి కొనసాగుతూనే ఉంది. దీపావళి కూకట్ పల్లి, జీడిమెట్ల, పంజాగుట్ట, ఎల్బీనగర్ , లింగపల్లి, మెహిదీపట్నం వంటి పలు ప్రాంతాల్లో (Residents decorated with flowers and lights)ఈ దివాళి సందడి మరింత ఎక్కువగా కనిపించింది. మొత్తంగా నగరమంతా దీపావళి కాంతులతో వెలిగిపోతుంది. మరోవైపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలతో వెలుగు నిండాలని కోరుకున్నారు.
ఇక నగరంలోని పలువురు వైద్యులు తల్లిదండ్రులకు కీలక సూచనలు(Diwali Safety Tips,) చేశారు. టపాసులు కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పేలుడు తీవ్రత ఎక్కువ ఉండే క్రాకర్స్ దగ్గరకు పిల్లలను పంపవద్దని సూచించారు. అలానే బాంబులు కాల్చేటప్పుడు కళ్లకు అద్దాలు పెట్టుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. దుస్తులకు దూరంగా ఉంచి క్రాకర్స్ కాల్చుకోవాలని సూచిస్తున్నారు. అలానే టపాసులు కాల్చే సమయంలో పక్కనే వాటర్ పెట్టుకోవాలని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన.. కొనసాగుతున్న పెట్టుబడుల వేట..
రెయిన్ అలర్ట్ .. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..