Constable Assasination Accused: కానిస్టేబుల్ హత్య కేసు.. నిందితుడు రియాజ్ మృతదేహానికి పోస్టుమార్టం ఖరారు..
ABN , Publish Date - Oct 20 , 2025 | 08:23 PM
కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతదేహానికి పోలీస్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నిజామాబాద్: కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతదేహానికి పోలీస్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం పోస్టుమార్టం జరగనుంది. ఎన్‌కౌంటర్‌పై నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫోర్త్ ఫ్లోర్‌లో సీన్ రీకన్‌స్ట్రక్షన్ జరిగింది. నిజామాబాద్ సీపీ సాయి చైతన్య, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి ఎదుట భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. ఇక, జ్యుడీషియల్ ఎంక్వైరీ తర్వాత రియాజ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
హైదరాబాద్ లో మెరుగైన చికిత్స అందిస్తున్నాం
సంఘటనపై సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ.. ‘ఆస్పత్రిలో ఉన్న రియాజ్ ఉదయం ఆర్‌ఐ తుపాకీ లాక్కున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపారు. రియాజ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశాం. రియాజ్ దాడిలో గాయపడ్డ ఆసీఫ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది’ అని తెలిపారు.
కోటి ఎక్స్‌గ్రేషియా..
షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ కుటుంబానికి జీవో ఆర్టీ నెంబర్ 411 ప్రకారం ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు డీజీపీ ప్రకటించారు. కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబసభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. జీవో 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామన్నారు. అలాగే పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన.. కొనసాగుతున్న పెట్టుబడుల వేట..
రెయిన్ అలర్ట్ .. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..