Diwali Celebrations 2025: అంబరాన్ని అంటుతున్న దీపావళి సంబరాలు..
ABN , Publish Date - Oct 20 , 2025 | 08:38 PM
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. దీపావళి వేళ లక్ష్మీదేవికి పూజ చేసిన హిందూ సోదరులు సోమవారం సాయంత్రం నుంచీ టపాసులు పేలుస్తూ సందడి చేస్తున్నారు.
విజయవాడ: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు (Diwali celebrations 2025) అంబరాన్ని అంటుతున్నాయి. దీపావళి వేళ లక్ష్మీదేవి (Lakshmidevi)కి పూజ చేసిన హిందూ సోదరులు సోమవారం సాయంత్రం నుంచీ టపాసులు(Firecrackers) పేలుస్తూ సందడి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, విజయవాడ(Vijayawada), విశాఖ వంటి ప్రధాన నగరాల్లో టపాసుల మోత మోగిపోతోంది.
రెండ్రుజులుగా బాణసంచా దుకాణాలు కిక్కిరిపోతున్నాయి. ఖర్చు ఎంతైనా తగ్గకుండా భారీగా టపాసులు కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. దేశంలోని వీధులన్నీ చిన్నాపెద్ద అని తేడా లేకుండా నిండిపోయాయి. అందరూ తమ ఇళ్ల ముందు భారీగా బాణసంచా పేలుస్తూ దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. కాగా, తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
పక్కన పెట్టిన గత వైసీపీ సర్కారు.. శిథిలావస్థలో ఈ-ఆటో
రెయిన్ అలర్ట్ .. రేపు ఆ జిల్లాలో భారీ వర్షాలు