Share News

Pemmasani Chandrasekhar: అంబటి రాంబాబు అలా మాట్లాడొద్దు.. పెమ్మసాని ఫైర్

ABN , Publish Date - Dec 14 , 2025 | 03:09 PM

వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు డమ్మీలు అనటం అంబటికి మంచి పద్ధతి కాదని హితవు పలికారు.

Pemmasani Chandrasekhar: అంబటి రాంబాబు అలా మాట్లాడొద్దు.. పెమ్మసాని ఫైర్
Pemmasani Chandrasekhar

గుంటూరు జిల్లా, డిసెంబరు14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత అంబటి రాంబాబుపై (Ambati Rambabu) కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు డమ్మీలు అనటం అంబటికి మంచి పద్ధతి కాదని హితవు పలికారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఆ పార్టీ నాయకులు ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అంబటి రాంబాబు పరిస్థితి తాను అర్థం చేసుకోగలనని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతల కామెంట్స్‌పై తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇవాళ(ఆదివారం) గుంటూరు జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు పెమ్మసాని చంద్రశేఖర్.


శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణపై అంబటి రాంబాబు లాగా నేను మాట్లాడాలేనని అన్నారు. రెండేళ్లలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి తొలగింపుపై ఏజెన్సీలతో తాము మాట్లాడుతున్నామని తెలిపారు. రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి తొలగింపు క్లిష్టమైన ప్రకియ అని చెప్పుకొచ్చారు. ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి అయ్యేలోపు మిగిలిన రైల్వే బ్రిడ్జిని తొలగిస్తామని పేర్కొన్నారు. శంకర్ విలాస్ సెంటర్ నిర్మాణంలో నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తున్నామని పెమ్మసాని చంద్రశేఖర్ భరోసా కల్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పేదలపై భారం మోపని పన్ను విధానం అవసరం: యనమల

విశాఖ బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నేవీ మారథాన్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 14 , 2025 | 03:13 PM