Navy Marathon: విశాఖ బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నేవీ మారథాన్
ABN , Publish Date - Dec 14 , 2025 | 09:56 AM
విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో నేవీ మారథాన్ 2025ను ఇవాళ(ఆదివారం) నిర్వహించారు. 42కే, 21కే, 10కే, 5కే విభాగాల్లో నేవీ మారథాన్ జరిగింది. ఈ మారథాన్‌లో సుమారు 18 వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. ఈ మారథాన్‌కు సుమారు 17 దేశాల నుంచి విదేశీ రన్నర్లు హాజరయ్యారు.
విశాఖపట్నం, డిసెంబరు14 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో నేవీ మారథాన్ 2025ను (Vizag Navy Marathon 2025) ఇవాళ(ఆదివారం) నిర్వహించారు. 42కే, 21కే, 10కే, 5కే విభాగాల్లో నేవీ మారథాన్ జరిగింది. ఈ మారథాన్‌లో సుమారు 18 వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. ఈ మారథాన్‌కు సుమారు 17 దేశాల నుంచి విదేశీ రన్నర్లు హాజరయ్యారు.
42కే రన్‌ను తూర్పు నౌకాదళాధిపతి సంజయ్ బల్లా... 21కే రన్‌ను సంజయ్ బల్లా సతీమణి ప్రియా బల్లా ప్రారంభించారు. 10కే రన్‌ను జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్... 5కే రన్‌ను విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రారంభించారు. ఈ మారథాన్‌లో ఉత్సాహంగా రన్నర్లు పాల్గొన్నారు. వైజాగ్ నేవీ మారథాన్ నేపథ్యంలో బీచ్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
నేవీ మారథాన్ విశాఖ ఖ్యాతి పెంచుతుంది: హరేంధిర ప్రసాద్
ఫుల్ మారథాన్‌తో పాటు సంకల్ప మారథాన్ కూడా నిర్వహిస్తున్నారని విశాఖపట్నం కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నం ఖ్యాతి మరింత పెంచే నేవీ మారథాన్‌ను నిర్వహిస్తున్న ఈస్టర్న్ నేవీకి హరేంధిర ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.
నేవీ మారథాన్‌తో ఫిట్‌నెస్ పెరుగుతుంది: శంఖబ్రత బాగ్చి
వైజాగ్ నేవీ మారథాన్ 10వ ఎడిషన్ ఆదివారం జరుగుతోందని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. ఒక్క 5కేలో పది వేలమంది పాల్గొనడం హర్షణీయమని తెలిపారు. ఈ ఈవెంట్‌తో ఫిట్‌నెస్ కల్చర్ పెరుగుతుందని వివరించారు. నేవీ మారథాన్ విశాఖపట్నం నగరానికి గర్వకారణమైన వేడుక అని చెప్పుకొచ్చారు. వైజాగ్ నేవీ మారథాన్‌తో దేశంలో ఫిట్‌నెస్‌కు క్యాపిటల్‌గా అవుతుందని శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఫైబర్ నెట్ కేసు కొట్టివేత
శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్
Read Latest AP News And Telugu News