Share News

Google Red Alert: 250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..

ABN , Publish Date - Sep 01 , 2025 | 02:04 PM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన యూజర్లకు గూగుల్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. షైనీ హంటర్స్ సహా అనేక గ్రూపులు హ్యాకింగ్ దాడులు తీవ్రం చేసిన దృష్ట్యా 250 మంది మెయిల్ యూజర్లు తక్షణమే పాస్ వర్ట్ మార్చుకోవాలని హెచ్చరించింది.

Google Red Alert: 250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..
Google security warning for gmail users

సిలికాన్ వ్యాలీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2.5 బిలియన్ జీమెయిల్ వినియోగదారులకు గూగుల్ అత్యవసర అలర్ట్ జారీ చేసింది. హ్యాకర్ల దాడులు పెరుగుతున్న దృష్ట్యా వినియోగదారులు అప్రమత్తమవ్వాలని హెచ్చరికలు జారీ చేసింది. ఖాతాల భద్రతను పెంపొందించుకునేందుకు పాస్‌వర్డ్‌లు వెంటనే అప్‌డేట్ చేయాలని సూచించింది. టూ-స్టెప్ వెరిఫికేషన్ (2SV)ఆన్ చేయడం తప్పనిసరి అని తెలిపింది. సైబర్‌ దాడుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసినట్లు సంస్థ స్పష్టం చేసింది.


గూగుల్ ప్రకారం, ఈ దాడుల వెనక ‘షైనీహంటర్స్’ అనే అంతర్జాతీయ హ్యాకర్ గ్రూప్ ఉన్నట్లు తెలుస్తోంది. 2020 నుంచి యాక్టివ్‌గా ఉన్న ఈ గ్రూప్, ఏటీఅండ్ టీ, మైక్రోసాఫ్ట్, సాంటాండర్, టికెట్‌మాస్టర్ వంటి ప్రముఖ కంపెనీల డేటా లీక్ కేసుల్లో నిందితులుగా నిలిచింది. వీరు ప్రధానంగా ఫిషింగ్ పద్ధతిని ఉపయోగించి వినియోగదారులను నకిలీ లాగిన్ పేజీలకు మళ్లించి, పాస్‌వర్డ్‌లు,సెక్యూరిటీ కోడ్‌లను దొంగిలిస్తున్నారని గూగుల్ తెలిపింది.


ఇప్పటికే జూన్‌లోనే గూగుల్ బ్లాగ్‌పోస్ట్‌లో షైనీహంటర్స్ గ్రూప్ కొత్త డేటా లీక్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించడానికి ప్రయత్నిస్తోంది. దీని వల్ల డేటా దోపిడీలు మరింత పెరిగే అవకాశం ఉందని గూగుల్ హెచ్చరిస్తోంది. ఆగస్టు 8న ప్రభావిత ఖాతాదారులకు ప్రత్యేక మెయిల్స్ పంపి సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను తక్షణం అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.


టూ-స్టెప్ వెరిఫికేషన్ ఎందుకు?

  • గూగుల్ హెచ్చరిక ప్రకారం, 2SV ఆన్ చేయడం ద్వారా ఇమెయిల్ అకౌంట్‌కు అదనపు రక్షణ కలుగుతుంది. హ్యాకర్లు పాస్‌వర్డ్‌ను తెలిసినా సెక్యూరిటీ కోడ్ లేకుండా లాగిన్ కావడం అసాధ్యం. ఈ కోడ్ సాధారణంగా మొబైల్ లేదా నమ్మదగిన పరికరానికి వస్తుంది.

  • యూకేలోని యాక్షన్ ఫ్రాడ్ ప్రకారం 2SV ఆన్ చేస్తే హ్యాకర్లు మీ ఖాతాలోకి ప్రవేశించలేరు. కొన్ని నిమిషాల్లో పూర్తయ్యే ఈ చర్య మీ ఇమెయిల్‌ను సురక్షితంగా ఉంచుతుంది.

  • ఇది కేవలం జీమెయిల్‌కే పరిమితం కాదని బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్, సోషల్ మీడియా ఖాతాల వంటి అన్ని ప్రధాన సేవల్లో కూడా టూ-ఫాక్టర్ ఆథెంటికేషన్ (2FA) లేదా మల్టీ-ఫాక్టర్ అథెంటికేషన్ (MFA) అందుబాటులో ఉందని నిపుణులు సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

అమెరికాకు మా సేవల్లో అంతరాయం లేదు: గరుడ వేగ

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 01 , 2025 | 04:00 PM