Luis Suarez spits: కోచ్‌పై ఉమ్మేసిన మియామి ఆటగాడు.. లీగ్స్ కప్ ఫైనల్‌లో ఉద్రిక్తతలు..
ABN , Publish Date - Sep 01 , 2025 | 01:41 PM
లీగ్స్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సియాటిల్ సౌండర్స్ జట్టు ఇంటర్ మియామిపై 0-3 విజయ కేతనం ఎగురవేసింది. నిజానికి ఈ మ్యాచ్‌ను మియామి గెలుచుకుంటుందని అందరూ అంచనా వేశారు. అయితే..
లీగ్స్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సియాటిల్ సౌండర్స్ జట్టు ఇంటర్ మియామిపై 0-3 విజయ కేతనం ఎగురవేసింది (Inter Miami vs Seattle brawl). నిజానికి ఈ మ్యాచ్‌ను మియామి గెలుచుకుంటుందని అందరూ అంచనా వేశారు. అయితే అత్యంత అవమానకర రీతిలో ఫైనల్ మ్యాచ్‌లో ఓటమిని మూటగట్టుకుంది. మ్యాచ్ అనంతరం మియామీ ఆటగాడు లూయిస్ సువారెజ్ వ్యవహరించిన తీరు తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది (Suarez fight Leagues Cup).
ఫైనల్‌లో అవమానకరమైన ఓటమితో కలత చెందిన సువారెజ్ స్టేడియంలో దిగ్భ్రాంతికర చర్యకు పాల్పడ్డాడు. మ్యాచ్ పూర్తయిన తర్వాత సియాటిల్ మిడ్‌ఫీల్డర్, ఓబెద్ వర్గాస్ వైపు సువారెజ్ పరిగెత్తి అతడిని హెడ్‌లాక్‌లో పడేశాడు. దీంతో సియాటిల్, మయామి ఆటగాళ్ల మధ్య గొడవ మొదలైంది. ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. రెండు జట్ల ఆటగాళ్లను వేరు చేయడానికి కొన్ని నిమిషాలు పట్టింది (Suarez controversy 2025).
ఆ సమయంలో సువారెజ్ సియాటిల్ సౌండర్స్ అసిస్టెంట్ కోచ్ దగ్గరకు వెళ్లి అతడితో ఘర్షణకు దిగాడు. ఇతర ఆటగాళ్లు సువారెజ్‌ను తీసుకువెళుతుండగా, అతడు కోచ్ ముఖంపై కూడా ఉమ్మివేశాడు (Luis Suarez coach spitting video). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సువారెజ్ తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ఇదేంది భయ్యా.. ఇలా కూడా అవుట్ అవుతారా? బౌలర్ వైడ్ బాల్ వేస్తే..
సిరాజ్‌కు అది 5-స్టార్ జైలు.. ఓదార్చేందుకు కూడా కుదర్లేదు: భరత్ అరుణ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి