Wide ball hit wicket: ఇదేంది భయ్యా.. ఇలా కూడా అవుట్ అవుతారా? బౌలర్ వైడ్ బాల్ వేస్తే..
ABN , Publish Date - Aug 31 , 2025 | 02:40 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో టీ-20 లీగ్‌లు జరుగుతున్నాయి. ప్రస్తుతం వెస్టిండీస్‌లో కరేబియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. టీ-20 క్రికెట్ అంటేనే ఎన్నో వింతలకు నెలవు. తాజాగా ఈ టోర్నీలో ఓ బ్యాటర్ అవుట్ అయిన తీరు చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో టీ-20 లీగ్‌లు జరుగుతున్నాయి. ప్రస్తుతం వెస్టిండీస్‌లో కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2025) జరుగుతోంది. టీ-20 క్రికెట్ అంటేనే ఎన్నో వింతలకు నెలవు. తాజాగా ఈ టోర్నీలో ఓ బ్యాటర్ అవుట్ అయిన తీరు చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. వైడ్ బాల్ ఆడే క్రమంలో ఆ బ్యాటర్ తనను తానే అవుట్ చేసుకున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (hit wicket dismissal).
సీపీఎల్‌లో భాగంగా నైట్ రైడర్స్, గుయానా అమేజాన్ వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భాగంగా గుయానా అమేజాన్ వారియర్స్ జట్టుకు చెందిన షాయ్ హోప్ (Shai Hope) బ్యాటింగ్ చేస్తున్నాడు. తనకు సాధ్యమైన రీతిలో మైదానం నలువైపులా బౌండరీలు కొడుతున్నాడు. ఆ సమయంలో నైట్ రైడర్స్ బౌలర్ టెర్రన్స్ హిండ్స్ ఆఫ్-స్టంప్‌నకు అవతల ఒక బంతిని వేశాడు. దీంతో హోప్ ఆ బంతిని రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బాగా వైడ్‌గా వెళ్లింది (bizarre cricket moments).
ఆ బంతిని ఆడే క్రమంలో హోప్ తన వికెట్లను బ్యాట్‌తో కొట్టేసుకున్నాడు (wide ball hit wicket). దీంతో బెయిల్స్ కింద పడిపోయాయి. అంపైర్ అతడిని హిట్‌వికెట్ అని ప్రకటించడంతో నిరాశగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ అరుదైన సంఘటన చూసిన కామెంటేటర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఈ విచిత్రమైన అవుట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
హర్భజన్ సింగ్ శ్రీశాంత్ చెంప ఛెళ్లుమనిపించిన ఘటన.. పాత వీడియోను షేర్ చేసిన లలిత్ మోదీ
చెంపదెబ్బ వీడియో రిలీజ్.. లలిత్ మోదీపై శ్రీశాంత్ భార్య ఆగ్రహం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి