Mohammed Siraj emotional moment: సిరాజ్‌కు అది 5-స్టార్ జైలు.. ఓదార్చేందుకు కూడా కుదర్లేదు: భరత్ అరుణ్
ABN , Publish Date - Aug 31 , 2025 | 03:16 PM
హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ 2020లో టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఆ టెస్ట్ సిరీస్ సమయంలో సిరాజ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. దేశం తరఫున్ టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేస్తున్న సమయంలోనే అతడి తండ్రి మరణించారు.
హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ 2020లో టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఆ టెస్ట్ సిరీస్ సమయంలో సిరాజ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. దేశం తరఫున్ టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేస్తున్న సమయంలోనే అతడి తండ్రి మరణించారు. అదే సమయంలో కరోనా ఆంక్షలను కూడా ఎదుర్కోవాల్సి రావడంతో సిరాజ్ తీవ్ర మానసిక క్షోభను ఎదుర్కొన్నాడు. అప్పటి కఠిన పరిస్థితుల గురించి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాట్లాడాడు.
'అప్పటికే ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సిరాజ్ తండ్రి గురించిన సమాచారం తెలిసింది. కరోనా కావడంతో స్వదేశానికి రావడానికి కూడా సిరాజ్‌కు కుదరలేదు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ కఠిన నిబంధనల కారణంగా బయో బబుల్‌లోనే ఉండిపోవాల్సింది. సహచర క్రికెటర్లు కూడా సిరాజ్‌ను కలిసే వీలు లేదు. చివరకు అతి కష్టం మీద జట్టు మేనేజర్ సిరాజ్‌ను కలిసి మాట్లాడారు. అప్పుడు సిరాజ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాడు' అని భరత్ అరుణ్ చెప్పాడు.
'సిరాజ్ రూమ్‌లో వేరెవరూ లేరు. ఒక్కడే కూర్చుని బాధపడేవాడు. నిజానికి అది సిరాజ్‌కు 5-స్టార్ జైలు. ఆ సమయంలో మిగతా ఆటగాళ్లు కూడా సిరాజ్ దగ్గరకు వెళ్లలేకపోయారు. కేవలం వాట్సాప్ కాల్స్‌లో మాత్రమే మాట్లాడే వీలుండేది. కానీ, నేరుగా కలిసి మాట్లాడే దొరికే ఓదార్పు వేరు. మొత్తానికి ఆ సమయంలో సిరాజ్ చాలా కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు' అని భరత్ అరుణ్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి
హర్భజన్ సింగ్ శ్రీశాంత్ చెంప ఛెళ్లుమనిపించిన ఘటన.. పాత వీడియోను షేర్ చేసిన లలిత్ మోదీ
చెంపదెబ్బ వీడియో రిలీజ్.. లలిత్ మోదీపై శ్రీశాంత్ భార్య ఆగ్రహం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి