Chilling CCTV Footage Goes Viral: పాపం పెద్దాయన.. రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళుతుండగా..
ABN , Publish Date - Sep 01 , 2025 | 01:38 PM
జగజ్జీవన్ రోజూ లాగే ఆదివారం కూడా సైకిల్ మీద బయటకు వెళ్లాడు. రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో స్పీడు బ్రేకర్ల దగ్గర అనుకోని విషాదం చోటుచేసుకుంది.
మరణం ఎప్పుడు? ఎలా? మనల్ని చేరుతుందో ఎవ్వరమూ చెప్పలేము. ఏ రూపంలోనైనా మృత్యువు కబళించవచ్చు. ఇందుకు పంజాబ్‌లో జరిగిన ఈ విషాదమే ప్రత్యక్ష ఉదాహరణ. గోడ ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళుతుండగా గోడ అతడిపై కుప్పకూలింది. దీంతో పెద్దాయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మన్సా జిల్లాలోని జవ్‌హార్కే గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు జగజ్జీవన్‌కు సైకిల్ మీద ఊర్లు తిరగటం అంటే ఇష్టం.
దూర ప్రాంతాలకైనా సైకిల్ మీదే వెళుతూ ఉంటాడు. రోజూ లాగే ఆదివారం కూడా సైకిల్ మీద బయటకు వెళ్లాడు. రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో స్పీడు బ్రేకర్ల దగ్గర అనుకోని విషాదం చోటుచేసుకుంది. గోడ రూపంలో మృత్యువు ఆయన్ని కబళించింది. భారీ వర్షాల కారణంగా రోడ్డు పక్క ఉన్న గోడ బాగా దెబ్బతింది. జగజ్జీవన్ అటువైపు రాగానే ఠక్కున ఆయనపై కుప్పకూలింది. రోడ్డుపై పడి గోడ మొత్తం ధ్వంసం అయింది. ఇటుకలు చెల్లా చెదురుగా పడిపోయాయి.
జగజ్జీవన్ వాటికింద పడి నలిగిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీటీవీటీ ఫుటేజీ తాలూకా వీడియో ఆకాశ్‌దీప్ తిండ్ అనే వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇది చాలా విషాదరకరమైన సంఘటన. పాపం ఆ పెద్దాయన’..‘పంజాబ్‌లో ఏం జరుగుతోంది. ఓ వైపు వరదలు.. మరో వైపు గోడలు కూలడాలు. ప్రభుత్వ వైఫలయ్యమే ఇందుకు కారణం’ అంటూ మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
చంద్రబాబు ది గ్రేట్.. సీబీఎన్ కు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభినందనలు
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూప్రకంపనలు.. 622కు చేరిన మృతుల సంఖ్య..